హీరోయిన్ శృతి హాసన్ హార్ట్ అయ్యింది అనే న్యూస్ ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. కారణం ఆమె నటించిన వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాల్లో ఆమెని హీరోయిన్ గా కేవలం పాటల కోసమే పెట్టి కేరెక్టర్ ని మాత్రం కూరలో కర్వేపాకు మాదిరిగా చేశారనే విషయంలో శృతి హాసన్ అలిగింది అంటున్నారు. ముఖ్యంగా తాను నమ్ముకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని తనని మోసం చేసాడట, వీరసింహారెడ్డిలో పూచికపుల్లలాంటి పాత్రతో తన పాత్రని తేలిగ్గా చేసేశాడనే బాధ ఉంది అంటున్నారు.
అందుకే వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న శృతి హాసన్ తర్వాత ఫీవర్ తో బాధపడినా.. సినిమా రిలీజ్ అయ్యాక తన పాత్రపై వచ్చిన విమర్శలతో హార్ట్ అయ్యింది కాబట్టే.. నిన్నగాకమొన్న జరిగిన వీరసింహారెడ్డి సక్సెస్ పార్టీకి రాలేదు అనే టాక్ గట్టగా వినబడుతుంది. ఇక వాల్తేర్ వీరయ్యలో శృతి హాసన్ కి ఎంతోకొంత ప్రాధాన్యత ఉన్న పాత్ర అయినా.. ఈ చిత్రంలో యాక్షన్ విన్యాసాల్లో కనిపించినా అది అంతగా హైలెట్ కాకపోవడం ఒక ఎత్తు, అలాగే వాల్తేర్ వీరయ్య విజయోత్సవంలో కనీసం శృతి పేరు కూడా ఎత్తలేదు. దానితో ఈ రెండు సినిమాల విషయంలో శృతి హాసన్ పూర్తిగా నిరాశపడిపోయింది అని తెలుస్తుంది. ఆమె ఫాన్స్ కూడా ఈ విషయంలో బాగా డిస్పాయింట్ అయ్యారు.
ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ తో పాన్ ఇండియా ఫిలిం సలార్ లో నటిస్తుంది. ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగులో ఎలాంటి ప్రాజెక్ట్ కి సైన్ చెయ్యలేదు.