నిన్న జనవరి 23న అతియా శెట్టి-KL రాహుల్ ల వివాహం సునీల్ శెట్టి స్వగ్రామమైన ఖండాల ఫామ్ హౌస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. అతియా శెట్టి-రాహుల్ పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే క్షణాల్లో వైరల్ గా మారాయి. అతియా-రాహుల్ వివాహనికి అతికొద్ది మంది అతిథులు, అలాగే సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సెలబ్రిటీలు రాకతో ఖండాలలో ఫామ్ హౌస్ ప్రాంతమంతా విలాసవంతమైన కార్లు, వాహనాలతో నిండిపోయింది. డయానా పెంటీ, కృష్ణ ష్రాప్, అంశులా కపూర్, క్రికెటర్లు వరుణ్ ఆరోన్, ఇశాంత్ శర్మ లాంటి ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు.
కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించిన సునీల్ శెట్టి పెళ్ళికి వచ్చినవారందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియో వదిలాడు. అతియా-రాహుల్ వివాహం వైభవంగా జరిగింది. రాహుల్ నా అల్లుడు కాదు.. కొడుకు ఇంటికి వచ్చాడని భావిస్తున్నాను. మామ హోదాలో ఉండదలుచుకోలేదు. నేను రాహుల్ కి తండ్రిలాంటి పాత్రను పోషిస్తాను. అత్తగారిల్లు అంటూ అతన్ని దూరం చేసే ప్రయత్నం చేయలేను. నా కొడుకులా రాహుల్‌ను భావిస్తున్నాను అంటూ సునీల్ శెట్టి రాహుల్ పై ప్రేమని చూపించాడు.
అయితే పెళ్లి తర్వాత జరగాల్సిన రిసెప్షన్ మాత్రం ఇప్పుడు జరపడం లేదని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత అతియా-రాహుల్ ల విందు వేడుకను నిర్వహిస్తాం. అది మే నెలలో గానీ, జూన్ నెలలో గానీ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఆ తేదీని మీడియాకు అధికారికంగా ప్రకటిస్తాం అంటూ సునీల్ శెట్టి ఆ వీడియోలో చెప్పారు. అలాగే జాతీయ-రాహుల్ లు వివాహం తర్వాత వెళ్లాల్సిన హనీమూన్ ట్రిప్ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వలన వాయిదా పడినట్లుగా తెలుస్తుంది.