రాశి ఖన్నా మొదటి నుండి గ్లామర్ డాల్ గానే ఎక్స్పోజ్ అయ్యింది. ఒకప్పుడు పద్దతిగా, ఒకప్పుడు గ్లామర్ గా కాదు.. ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటినుండి అందాలు ఆరబోసే పనిలోనే ఉంది. వరస సినిమాలతో బిజీగా ఉంటున్న రాశి ఖన్నా కి మాత్రం ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ తగలడం లేదు. తెలుగులోనే కాదు, తమిళంలోనూ రాశి ఖన్నా హిట్ కోసం అర్రులు చాచుకుని కూర్చుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న రాశి ఖన్నా ఇప్పుడు బరువు తగ్గి ముద్దుగాను, నాజూగ్గాను తయారయ్యింది కానీ.. అమ్మడుకి అవకాశాలే రావడం లేదు.
ప్రస్తుతం హిందీలో కొద్దిగా బిజీగా మారింది. అక్కడ వెబ్ సీరీస్ లతో సత్తా చాటాలని చూస్తుంది. రాజ్ అండ్ DK దర్శకత్వంలో తెరకెక్కిన Farzi ప్రమోషన్స్ లో హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతులతో కలిసి తిరుగుతుంది. ఈ ప్రమోషన్స్ లో రాశి ఖన్నా చాలా గ్లామర్ గా కనబడుతుంది. Farzi ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనే అందాలు ఆరబోసిన రాశి ఖన్నా ఇప్పుడు గ్లామర్ గా అందంగా కనిపినిపిస్తుంది.
ఇవే కాకుండా హిందీలో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి యోధా సినిమాలో నటిస్తుంది. మరి ఆ వెబ్ సీరియస్, ఈ సినిమా వర్కౌట్ అయితే రాశి ఖన్నా బాలీవుడ్ లోనే సెటిల్ అయినా ఆశ్చర్య పోవక్కర్లేదు.