గత కొంతకాలంగా రశ్మికని ట్రోల్స్ చేస్తూ చాలామంది నెటిజెన్స్, యాంటీ ఫాన్స్ ఆమెని మానసికంగా హింసిస్తున్నారు. రష్మిక ఏం మాట్లాడినా అందులో డబుల్ మీనింగ్ అర్ధాలు వెతికి మరీ ట్రోల్ చేస్తున్నారు. రష్మిక కూడా కూల్ గా షూటింగ్స్ చేసుకుంటే ఎవ్వరు ఏమంటారు. కానీ రష్మిక కూడా అప్పుడప్పుడు కొద్దిగా తేడాగా కాంట్రవర్సీగా మాట్లాడుతూ ట్రోల్ కి గురవుతుంది. తర్వాత ట్రోల్ చేస్తారంటూ ఫైర్ అవుతుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న ఈ విషయంలో తెగ బాధపడిపోతుంది. తాను ఏం మాట్లాడినా తప్పే, చివరికి గాలి పీల్చుకోవాలన్నా భయమేస్తుంది.. అంటూ వాపోతుంది.
జిమ్ లో కష్టపడి వర్కౌట్స్ చేసి సన్న బడితే.. అబ్బాయిలా ఉన్నావంటూ కామెంట్ చేస్తారు. జిమ్ చెయ్యకపోతే లావుగా తయారైన రష్మిక అంటారు. ఏమైనా మాట్లాడితే ఏం మాట్లాడావ్ తల్లీ, చెత్తగా మాట్లాడావ్ అంటారు. కాదు సైలెంట్ గా ఉంటే.. యాటిట్యూడ్ అంటారు. నడిచినా తప్పే, కూర్చున్నా తప్పే, చివరికి గాలి పీల్చుకోవాలన్నా తప్పులు వెతుకుతారేమో అనే భయం. అసలు వీళ్ళకున్న సమస్యేమిటో అర్ధం కావడం లేదు. నన్ను ఇండస్ట్రీలో ఉండమంటారా.. వెళ్లిపొమ్మంటారా.. మీరేం చెబితే అదే చేస్తాను అంటూ రష్మిక తెగ ఫీలైపోతుంది.
నేనంటే అంత నెగిటివిటి ఎందుకు, నన్ను ఎందుకంత ద్వేషిస్తారు అంటూ రష్మిక తన బాధని ఇలా ఓపెన్ గా వెళ్లగక్కింది. మరి తనని హీరోయిన్ గా లాంచ్ చేసిన ప్రొడక్షన్ హౌస్ విషయంలో, దర్శక, హీరో విషయంలో ఆమె చేసిన సైగలు, కాంతార సినిమాపై చేసిన వ్యాఖ్యలు బాగున్నాయా.. నిన్ను పొగిడినప్పుడు ఆనందంగా తీసుకున్న నీవు.. తప్పు చేసినప్పుడు ట్రోల్స్ ని ఫేస్ చేసే దైర్యం ఉండాలి రష్మిక అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.