Advertisementt

వీర సక్సెస్: హీరోయిన్ తో బాలయ్య పార్టీ

Mon 23rd Jan 2023 02:10 PM
balakrishna,honey rose  వీర సక్సెస్: హీరోయిన్ తో బాలయ్య పార్టీ
Balakrishna-Honey Rose party pic goes viral వీర సక్సెస్: హీరోయిన్ తో బాలయ్య పార్టీ
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ అఖండ విజయం తర్వాత వీరసింహారెడ్డితో కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నారు. గోపీచంద్ మలినేని బాలక్రిష్ణని వీరసింహారెడ్డిగా పవర్ ఫుల్ పాత్రలో చూపించారు. వీరసింహారెడ్డి యావరేజ్ టాక్ తోనే మంచి కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలవడంతో చిత్ర బృందం సక్సెస్ సెలెబ్రేషన్స్ తో పాటుగా అదే రోజు సక్సెస్ పార్టీ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విజయోత్సవ సభలో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నల గడ్డలు బాలకృష తర్వాత ప్రధాన ఆకర్షణగా కాగా.. తర్వాత జరిగిన పార్టీలో కూడా ఈ యంగ్ హీరోలు సందడి చేసారు.

బాలకృష్ణ యంగ్ హీరోల్లో యంగ్ హీరోగా, సీనియర్ హీరోల్లో సీనియర్స్ లా బిహేవ్ చేస్తూ ఎంతగా అల్లరి చేస్తూ ఉంటారో ఆహా అన్ స్టాపబుల్ ప్రతి ఎపిసోడ్ లో రియల్ గా చూపించారు. అయితే వీరసింహారెడ్డి సక్సెస్ పార్టీలో బాలయ్య చేసిన ఓ పని హైలెట్ అయ్యింది. వీరసింహారెడ్డిలో బాలయ్యతో నటించిన హాని రోజ్ తో కలిసి ఆయన పార్టీ చేసుకోవడం, అది కాస్తా పిక్ రూపం లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అలాగే ఇండస్ట్రీలో ఆ పిక్ హాట్ టాపిక్ గాను మారింది. బాలకృష్ణ హాని రోజ్ చేతులు పెనవేసుకుని డ్రింక్ తాగుతూ సరదాగా దిగిన పిక్ నిమిషాల్లో వైరల్ గా మారింది. 

కొంతమంది ఈ పిక్ పై పాజిటివ్ గా, సరదాగా, ఫన్నీగా రియాక్ట్ అవుతుంటే.. కొంతమంది బాలయ్య చేసిన పనిని విమర్శిస్తూ సాగదీస్తున్నారు.

Balakrishna-Honey Rose party pic goes viral:

Photo Moment: NBK Parties with Honey Rose

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ