Advertisementt

హిట్ డైరెక్టర్ తో వెంకీ మూవీ కన్ ఫర్మ్

Mon 23rd Jan 2023 01:11 PM
venkatesh,sailesh kolanu  హిట్ డైరెక్టర్ తో వెంకీ మూవీ కన్ ఫర్మ్
Venky75 Announcement హిట్ డైరెక్టర్ తో వెంకీ మూవీ కన్ ఫర్మ్
Advertisement
Ads by CJ

గత ఏడాది ఎఫ్3 బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వెంకటేష్ కొత్త సినిమాపై చాలా ఊహాగానాలు నడిచాయి. ఆయన కొంతకాలం సినిమా షూటింగ్స్ నుండి విరామం తీసుకుంటున్నారని, అలాగే కొత్త దర్శకులతో వెంకీ కొత్త సినిమా ఎనౌన్సమెంట్ రాబోతుంది అని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా HIT ఫ్రాంచైజ్ తో వరుస విజయాల్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్ కొల‌ను తో విక్టరీ వెంకటేష్ చేతులు కలపనున్నారు అన్నారు.

ఇప్పుడు అదే విషయాన్ని నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ కన్ ఫర్మ్ చేసింది. వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం- #Venky75, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ప్రొడక్షన్ నెం 2 గా రాబోతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ శ్యామ్ సింగరాయ్ తో నిర్మాణంలో విజయవంతంగా అడుగుపెట్టింది. వెంకటేష్‌ కెరీర్ లోనే ఈ ప్రాజెక్ట్ అత్యంత భారీ బడ్జెట్ సినిమా కానుంది. ఈ ప్రాజెక్ట్ ప్రీ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ చేతిలో ఏదో పట్టుకున్న సిల్హౌట్ ఇమేజ్ కనిపిస్తుంది. అది గన్ కాదు.. మరి అదేంటో అనే విషయం ఈ నెల 25న తెలుస్తుంది. భారీ పేలుడు, దట్టమైన పొగతో కూడిన ప్రీ-లుక్ పోస్టర్ వెంకటేష్ ఇంటెన్స్ రోల్, సినిమా యాక్షన్ జానర్‌ను సూచిస్తుంది.

విన్నంగ్ స్క్రిప్ట్‌ను రాసిన శైలేశ్ కొల‌ను, వెంకటేష్ ను మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ప్రజంట్ చేయనున్నారు. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారు.

Venky75 Announcement:

Venkatesh-Sailesh Kolanu Project Venky75 Announcement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ