బిగ్ బాస్ అంటే నాకు ప్రేమ, బిగ్ బాస్ అంటే నాకు ప్రాణం, బిగ్ బాస్ ని రూల్ చేస్తాను అంటూ బిగ్ బాస్ కే రూల్స్, గేమ్స్ నేర్పించబోయి టక్కున ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడి వెక్కివెక్కి ఏడ్చిన గీతూ రాయల్ అప్పటినుండి బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే జరిగి రేవంత్ టైటిల్ కొట్టేవరకు ఏడుస్తూనే ఉంది. తర్వాత మా టివిలో జరిగిన ప్రోగ్రామ్స్ లోను గీతూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తాను ఎలిమినేట్ అవుతానని ఊహించుకొని గీతూ ఎలిమినేట్ అయ్యేసరికి ఆమెకి నోటా మాట రాలేదు. దానితో ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వకుండా సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆమె కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తుంది.
బాలాదిత్య బలహీనతతో నేను ఆడుకొవడమే ప్రేక్షకులు నన్ను ఎలిమినేట్ చెయ్యడానికి కారణం, నేను గేమర్ ని ఆటలో గెలవడానికి ఆలోచిస్తాను. ఆయనని ఎమోషనల్ గా ఇబ్బందిపెట్టబట్టే హౌస్ నుండి బయటకి వెళ్ళాను, కానీ నేను తప్పుచెయ్యలేదు అంటూ వాదించింది. అలాగే బిగ్ బాస్ లోకి మళ్ళీ ఛాన్స్ వస్తే వెళతావా, నాన్ స్టాప్ ఓటిటిలోకి ఆహ్వానిస్తే మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతావా.. చచ్చినా పోనీ, బిగ్ బాస్ పై ఉన్న ప్రేమని ఒక్కసారే చూపిస్తాను, మళ్ళీ మళ్ళీ చూపించలేను, అందుకే నేను బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ ఛాన్స్ వస్తే అస్సలు పోను అంటూ సమాధానం చెప్పింది గీతూ.