బళ్లారిలో తనపై దాడి జరిగినట్లుగా వస్తున్న వార్తలను సింగర్ మంగ్లీ ఖండించింది. ఇదంతా తన ప్రతిష్టను కించపరచడానికి ఎవరో కావాలనే చేస్తున్నారని ఆమె ఆరోపించింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలను ఖండిస్తూ.. అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆమె ఓ లేఖ ద్వారా తెలియజేసింది.
‘‘నిన్న బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఫోటోలు మరియు వీడియోల నుండి మీరందరూ చూడగలిగే విధంగా, ఈవెంట్ భారీ విజయాన్ని సాధించింది మరియు ఉత్తమ ఈవెంట్‌లలో ఒకటిగా నిలిచింది. కన్నడ ప్రజలు నాపై కురిపించిన ప్రేమ మరియు మద్దతు అపారమైనది. ఈవెంట్‌లో నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఇది మాటలలో వర్ణించలేనిది. ఇదంతా నా ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్నారు మరియు ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని మంగ్లీ అధికారికంగా విడుదల చేసిన లేఖలో పేర్కొంది.
అంతకుముందు బళ్ళారిలో జరిగిన ఈవెంట్‌లో ఆమె కన్నడలో మాట్లాడలేదని.. కన్నఢ భాషాభిమానులు ఆమె కారుపై దాడి చేసినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలను ఖండిస్తూ.. మంగ్లీ ఇలా ఓ లేఖని విడుదల చేసింది. కాగా.. ప్రత్యేకమైన వాయిస్‌తో పాటలు పాడుతూ.. అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న మంగ్లీని.. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎస్వీబీసీ ఛానల్‌కు సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.
I completely deny Fake news on some social media groups about me…
— Mangli Official (@iamMangli) January 22, 2023
Please don’t spread wrong news pic.twitter.com/oy71WFEzFw