Advertisementt

‘లైగర్’ పోతేనేం.. విజయ్ క్రేజ్ తగ్గేదే లే!

Fri 03rd Mar 2023 01:07 PM
vijay deverakonda,rowdy,gowtam tinnanuri film,remuneration,tollywood hero,ram charan  ‘లైగర్’ పోతేనేం.. విజయ్ క్రేజ్ తగ్గేదే లే!
Gossips on Vijay Deverakonda Remuneration for Gowtam Tinnanuri Film ‘లైగర్’ పోతేనేం.. విజయ్ క్రేజ్ తగ్గేదే లే!
Advertisement
Ads by CJ

తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించి ఓ వార్త సోషల్ మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ, ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఒక చిత్రాన్ని ఓకే చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రీ లుక్ పోస్టర్ కూడా వదిలారు. వాస్తవానికి ఈ సినిమా రామ్ చరణ్ చేయాల్సింది. కానీ.. ఇది పోలీస్ ఆఫీసర్ పాత్ర కావడంతో చరణ్ తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే.. ధృవ, ఆర్ఆర్ఆర్ చిత్రాలలో చరణ్ పోలీస్ పాత్రలే చేశాడు. ఇప్పుడు మళ్లీ పోలీస్‌గా అంటే.. ఆ రెండు పాత్రలని మించి ఉంటేనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు. అందుకే చరణ్ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం, ఆ ప్లేస్‌లోకి రౌడీ విజయ్ వచ్చి చేరడం జరిగిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. 

సరే ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు విజయ్‌కి సంబంధించి వినిపిస్తున్న వార్త ఏమిటంటే.. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ రూ. 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. నిజంగా వింటుంటే షాక్‌గా అనిపిస్తుంది కదా. ‘బాహుబలి’ చిత్రానికి ప్రభాస్‌కు కూడా అంతే ఇచ్చినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాంటిది వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌కి ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్ అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే పాన్ ఇండియా వైడ్‌గా విజయ్‌కి ఇప్పుడు ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నారో.. లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే.. ఈ సినిమా విషయంలో అతని రెమ్యూనరేషన్‌పై హాట్‌ హాట్‌గా చర్చలైతే నడుస్తున్నాయి. 

అయితే ఈ రెమ్యూనరేషన్ విషయంలో మేకర్స్ సైడ్ నుంచి మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. ఆఫ్‌కోర్స్ అంత ఇస్తున్నామని వారూ చెప్పరనుకోండి. కానీ, ఖండించే అవకాశం అయితే ఉంది. అయితే అలాంటిది ఇప్పటి వరకు జరగలేదు. ఈ న్యూస్ మాత్రం వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ సినిమా కాకుండా విజయ్ ‘ఖుషి’ అనే చిత్రం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ చిత్రం సమంత కారణంగా హోల్డ్‌లో ఉంది. శివ నిర్వాణ ఆ చిత్రానికి దర్శకుడు.

Gossips on Vijay Deverakonda Remuneration for Gowtam Tinnanuri Film:

This is the Rowdy Vijay Deverakonda Craze

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ