Advertisementt

9వ రోజు.. ‘వీరయ్య’ ఊచకోత

Wed 25th Jan 2023 03:28 PM
waltair veerayya,9th day collections,megastar chiranjeevi,ravi teja,veerayya collections  9వ రోజు.. ‘వీరయ్య’ ఊచకోత
Waltair Veerayya 9th Collections Creates Records 9వ రోజు.. ‘వీరయ్య’ ఊచకోత
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్‌కి తెలియజేస్తుంది ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం. సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రం విడుదలై వారం రోజులు పైనే అయినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం వీర బాదుడు బాదుతూనే ఉంది. సంక్రాంతికి దిగిన అన్ని చిత్రాలను బీట్ చేసి.. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో వీరయ్య బాక్సాఫీస్‌ని ఊచకోత కోస్తున్నాడు. ఇది చిరు ఊహించిన విజయమే. అందుకే.. ఒక రోజు ఆలస్యంగా రావడానికి కూడా వెనుకాడలేదు. ఇక మొదటి వీకెండ్‌కే దాదాపు బ్రేక్ ఈవెన్ కొట్టేసిన వీరయ్య.. రెండో వీకెండ్‌లోనూ అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా దూసుకెళుతున్నాడు. 

రెండో వీకెండ్ శనివారం అయితే.. బాక్సాఫీస్‌పై వీరయ్య దాదాపు దండయాత్రే చేసేశాడు. సినిమా విడుదలైనప్పుడు ఎలా అయితే కలెక్షన్స్ వస్తాయో.. విడుదలైన 9వ రోజు శనివారం కావడంతో.. వీర కుమ్ముడు కుమ్మేశాడు. 9వ రోజు దాదాపు రూ. 6 ప్లస్ కోట్ల మేర షేర్‌ని రాబట్టి.. మెగాస్టార్ రేంజ్ ఏంటో మరోసారి తెలియజేసిందీ చిత్రం. కొన్ని చోట్ల ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు కూడా బద్దలైనట్లుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక 10వ రోజు ఆదివారం కావడంతో.. మరో మ్యాజిక్ ఫిగర్ వీరయ్య ఖాతాలో చేరడం ఖాయంగా తెలుస్తుంది. 

వీరయ్య చూపిస్తున్న వీర ప్రతాపానికి ఇప్పటికే రూ. 15 ప్లస్ కోట్ల మేర లాభాల బాటలో ఈ సినిమా నడుస్తున్నట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ దిశగా ఈ చిత్రం నడుస్తుంది. సంక్రాంతికి విడుదలైన ఇతర సినిమాల ప్లేస్‌లో కూడా ఇప్పుడు వీరయ్యనే ఆడిస్తున్నారంటే.. ఇంతకంటే విజయానికి కొలమానం ఏముంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.   

Waltair Veerayya 9th Collections Creates Records:

Waltair Veerayya Movie Beats All Sankranthi Movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ