నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ. 2 కోట్లు సాధించాలి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు మాత్రం ఊహించని విధంగా కలెక్షన్స్‌ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత రోజు నుంచి డ్రాప్ అవుతూ వచ్చింది. 10 రోజులు పూర్తయ్యే సరికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా రూ. 2 కోట్లు వెనకబడి ఉందనేలా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
‘వీరసింహారెడ్డి’ థియేట్రికల్ బిజినెస్ ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 74 కోట్ల షేర్‌ని రాబట్టాల్సి ఉంది. సెకండ్ వీకెండ్ కూడా ఈ చిత్రం పుంజుకోలేకపోయింది. విడుదలైన 10వ రోజు(శనివారం) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1 క్రోర్ ప్లస్ మాత్రమే కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఈ చిత్రం సుమారు రూ. 72 ప్లస్ కోట్ల షేర్‌ని రాబట్టినట్లుగా తెలుస్తుంది. అంటే బ్రేక్ ఈవెన్‌కి ఇంకా 2 కోట్లు రావాలి.
ప్రస్తుతం తెలుస్తున్న రిపోర్ట్స్ ప్రకారం నైజాం, సీడెడ్ మినహా.. మిగతా అన్ని ఏరియాలలో ఈ చిత్రం ఇంకా లాస్‌లో నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఆదివారం భారీ కలెక్షన్స్‌ని రాబడితే మాత్రం చాలా ఏరియాల్లో ఈ చిత్రం గట్టెక్కే అవకాశం ఉంది. అయితే చాలా చోట్ల ఈ సినిమా ప్రదర్శించబడుతోన్న థియేటర్లను ఈ రోజు నుంచి ‘వాల్తేరు వీరయ్య’కి కేటాయిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా మరో రెండు రోజులు మాత్రమే ఈ సినిమాకు ఛాన్స్ ఉంది. రెండు రోజుల తర్వాత ‘పఠాన్’ హవా మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి.. ఈ ఆదివారం ‘వీరసింహారెడ్డి’కి చాలా ఇంపార్టెంట్ కానుంది.