Advertisementt

అంత క్రేజీగా ఉంటే పసలేదంటారేంటి?

Sun 22nd Jan 2023 07:20 PM
balakrishna,pawan kalyan,unstoppable with nbk,pawan kalyan episode,aha,negative comments  అంత క్రేజీగా ఉంటే పసలేదంటారేంటి?
Negative Comments on Balayya and Pawan Episode అంత క్రేజీగా ఉంటే పసలేదంటారేంటి?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఆహా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం ఫాన్స్ క్రేజీగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ ఎపిసోడ్ వస్తుందా అని కాచుకుని కూర్చున్నారు. ఆహా వారు మాత్రం పవన్ కళ్యాణ్-బాలయ్య‌ల ప్రోమోలు వదులుతూ ఊరిస్తున్నారు. మొదటిసారి గ్లిమ్స్ వదిలారు. ఇప్పుడు ప్రోమో వదిలారు. అలాగే మెగా మేనల్లుడు సాయి తేజ్ ఈ షోలో మెరిశాడు. బాలయ్య డైలాగ్స్ కి పవన్ కళ్యాణ్ ముసిముసిగా నవ్వడం, బాలయ్య అల్లరిని పవన్ ఎంజాయ్ చెయ్యడం, పొలిటికల్ ప్రశ్నలతో షో హీటెక్కడం వంటి టాపిక్స్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచెయ్యడంతో పాటు.. రాబోయే ఎపిసోడ్‌ కోసం అంతా వెయిటింగ్ అనేలా చేశారు. 

ప్రతి మూమెంట్‌ని, ప్రతి మాటని అక్కడ ఆడియన్స్ మాత్రమే కాదు మెగా-నందమూరి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య-పవన్ బ్లాస్టింగ్ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కానీ అదో పెద్ద బోరింగ్ ఎపిసోడ్ అంటూ కొంతమంది పనిగట్టుకుని ప్రచారం స్టార్ట్ చేసేశారు. ఈయన ప్రజల చేతిలో ఓడిపోతే.. ఆయన తండ్రిని మోసం చేసి బావకి కొమ్ము కాస్తున్నాడంటూ కొంతమంది గీత దాటి కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో టిడిపి కలయికకు ఈ అన్‌స్టేబుల్ షో వేదిక కాబోతుంది అని కూడా ఉంటున్నారు.

మరి ప్రజల్లో, ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంత క్యూరియాసిటీగా ఉన్న ఈ బ్లాస్టింగ్ ఎపిసోడ్‌ని పసలేదంటూ కొంతమంది కామెంట్ చెయ్యడం మాత్రం విడ్డురంగా అనిపిస్తుంది. ఏదిఏమైనా ఈ క్రేజీ ఎపిసోడ్ కోసం కోట్లాదిమంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారన్నది మాత్రం కాదనలేని వాస్తవం.

Negative Comments on Balayya and Pawan Episode:

Trolling on Unstoppable with NBK Pawan Episode

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ