Advertisementt

రాహుల్-అతియా పెళ్లికి కఠినమైన రూల్స్

Sun 22nd Jan 2023 03:48 PM
kl rahul,athiya shetty,marriage,wedding,strict rules,cricketer kl rahul  రాహుల్-అతియా పెళ్లికి కఠినమైన రూల్స్
Strict Rules In KL Rahul and Athiya Shetty Wedding రాహుల్-అతియా పెళ్లికి కఠినమైన రూల్స్
Advertisement
Ads by CJ

క్రికెటర్ KL.రాహుల్‌తో బాలీవుడ్ నటి అతియా శెట్టి వెడ్డింగ్ పనులు ఖండాలలో ఘనంగా మొదలయ్యాయి. కొద్దిరోజులుగా డేటింగ్ లో ఉంటున్న రాహుల్-అతియాలు చివరికి పెళ్లి పీటలెక్కుతున్నారు. సునీల్ శెట్టి కూతురు పెళ్లిని ఆయన స్వరాష్ట్రం మహారాష్ట్ర ఖండాలలోని ఆయన సొంత ఇంట్లోనే జరిపించబోతున్నారు. ముందుగా ముంబైలోని ప్రముఖ హోటల్ లో రాహుల్-అతియా వివాహం చెయ్యాలనుకున్నప్పటికీ సునీల్ శెట్టి మాత్రం తన సొంత ఊర్లోనే కుమార్తె పెళ్లి చెయ్యాలని అనుకోవడంతో అటు రాహుల్ ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది అని తెలుస్తుంది.

అయితే KL రాహుల్ క్రికెటర్ అవడంతో అతని పెళ్ళికి ప్రముఖ క్రికెటర్స్ రాబోతున్నారు అని సమాచారం. అటు బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, షారుఖ్ లాంటి ప్రముఖులు హాజరవుతారని తెలుస్తుంది. అయితే అతియా-రాహుల్ పెళ్లికి చాలా రెస్ట్రిక్షెన్స్ పెడుతున్నారట. అవి పెళ్లి తంతు అంటే పెళ్లి కూతురుని చెయ్యడం, మెహిందీ, సంగీత్ వేడుకలు మొదలైనప్పటినుండి ఎవరూ ఫొటోస్ తియ్యకుండా ప్రైవసీ మెయింటైన్ చేయాలని కఠినమైన నిబంధనలు పెడుతున్నారట. మరి ఈ మధ్యన పెళ్లిళ్ల రైట్స్ ఓటిటీలకి అమ్మేసుకుంటూ పెళ్లి ఫొటోస్ లీక్ కాకుండా ఉండేందుకు ఇలాంటి నిబంధనలు పెట్టడం సాధారణంగా మారాయి.

అలాగే ఫొటోస్, పెళ్లి వీడియోస్ తీసే సంస్థకి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ లీకవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. జనవరి 22న మెహేంది వేడుకతో KL రాహుల్-అతియా శెట్టిల ప్రీ వెడ్డింగ్ పనులు మొదలవుతాయి. సో వాళ్ళు పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసే వరకు చూసే అవకాశం లేదు.

Strict Rules In KL Rahul and Athiya Shetty Wedding:

Star cricketer KL Rahul and Bollywood beauty Athiya Shetty Marriage Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ