మహేష్ బాబు తానొక్కడే విదేశీ ట్రిప్స్ ఎంజాయ్ చెయ్యడు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తాడు. మహేష్ ఆయన వైఫ్ నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలసి ట్రిప్ ని ఎంజాయ్ చేస్తాడు. ఏడాదిలో రెండుమూడుసార్లు కంపల్సరీ మహేష్ ఫ్యామిలీతో విదేశీ టూర్ ఉంటుంది. అయితే మహేష్ కొడుకు గౌతమ్ మొదటిసారి తన ఫ్యామిలీ లేకుండానే విదేశీ ట్రిప్ కి వెళ్లడంతో నమ్రత శిరోద్కర్ భావోద్వేగంతో కొడుకుని మిస్ అవుతున్న ఫీలింగ్ ని ట్వీట్ రూపంలో తెలియజేసింది.
స్కూల్ నుండి కల్చరల్ ప్రోగ్రాంలో భాగంగా గౌతమ్ ఫస్ట్ టైమ్ ఒక్కడే సొంతంగా విదేశానికి బయలుదేరాడు. దానితో నా సగ భాగం నన్ను విడిచిపెట్టినట్లుగా అనిపిస్తుంది. గౌతమ్ వెళ్ళిపోయాక ఒక రోజంతా ఏమి తోచలేదు. ఇప్పుడే సాధారణ స్థితిలోకి వస్తున్నాను, గౌతమ్ తిరిగొచ్చి మళ్ళీ మా కళ్ల ముందు కనిపించేంత వరకూ మాకు వెలితిగానే ఉంటుంది. ఏది ఏమైనా గౌతమ్ మమ్మల్ని వదిలి ఎగిరిపోయాడు. ఈ వన్ వీక్ లో గౌతమ్ తనని తాను కనుగొనాలి, అలాగే సంతోషం, ఎంజాయిమెంట్, సాహసం అన్ని గౌతమ్ సాధించాలని కోరుకుంటున్నాను, నీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉంటానంటూ గౌతమ్ తన ఫ్రెండ్స్ తో ఉన్న ఎయిర్ పోర్ట్ పిక్స్ ని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది.