Advertisementt

మిస్ యూ నాన్న.. రఘు కుంచే భావోద్వేగం

Sat 21st Jan 2023 10:20 PM
raghu kunche,raghu kunche father,raghu kunche emotional post,music director  మిస్ యూ నాన్న.. రఘు కుంచే భావోద్వేగం
Raghu Kunche Emotional Post Goes Viral మిస్ యూ నాన్న.. రఘు కుంచే భావోద్వేగం
Advertisement
Ads by CJ

సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచే ఇటీవల పితృవియోగానికి గురైన విషయం తెలిసిందే. అందరూ సంక్రాంతి సంబరాలను ఆశ్వాదిస్తే.. రఘు కుంచే మాత్రం తండ్రిని పోగొట్టుకుని పుట్టెడు దు:ఖంతో కృంగిపోయారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఓ పోస్ట్.. అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ పోస్ట్‌లో.. తన తండ్రి ఎలా చనిపోయారో చెబుతూ.. రఘు కుంచే భావోద్వేగానికి గురయ్యారు. 

‘‘నాన్న కాలం చెయ్యడానికి కొన్ని గంటలు ముందు.. నేను తెచ్చిన కొత్త బట్టలు వేసుకుని, ఫ్యామిలీతో ఉల్లాసంగానే గడిపి, దూరంగా ఉన్నవాళ్లతో వీడియో కాల్‌లో పలకరించి, మర్నాడు (17వ తేదీ) పొద్దున్నే లేచి స్నానం చేసి, పూజ చేసుకుని, బ్రేక్ ఫాస్ట్ చేసి.. తన కిష్టమైన మడత కుర్చీలో వెనక్కి వాలి, తన ప్రాణానికి ప్రాణమైన భగవద్గీత చదువుతూ అలానే శాశ్వత నిద్రలోకి జరిపోయారు. ఏ రోజు ఎవరినీ కించిత్ కూడా ఇబ్బంది పెట్టని నాన్న, ఆఖరి క్షణాల్లో కూడా అలానే వెళ్లిపోయారు.. మిస్ యూ నాన్న’’ అని రఘు కుంచే తన పోస్ట్‌లో వెల్లడించారు.

రఘు కుంచే చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు అందరూ.. ‘మీ తండ్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రఘు కుంచే చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Raghu Kunche Emotional Post Goes Viral:

Raghu Kunche Father Passes Away