Advertisementt

పాపం రష్మిక పరిస్థితి ఇలా అయ్యిందేమిటి

Sat 21st Jan 2023 11:28 AM
rashmika mandanna,mission majnu  పాపం రష్మిక పరిస్థితి ఇలా అయ్యిందేమిటి
Rashmika Mission Majnu public talk పాపం రష్మిక పరిస్థితి ఇలా అయ్యిందేమిటి
Advertisement
Ads by CJ

సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక కి బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడికి రెక్కలు కట్టుకుని వాలిపోయింది. ముంబైలో పాగా వేద్దామని రష్మిక మందన్న గ్లామర్ ఫొటోస్ తో మాత్రమే కాదు, అక్కడి పార్టీలకి, ఫంక్షన్స్ కి టూ మచ్ స్కిన్ షో చేస్తూ అందరి చూపు తనవైపే ఉండేలా చూసుకుంటుంది. అక్కడ హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇచ్చేలా తయారైన రశ్మికకి సినిమాలు మాత్రం మంచి ఫలితాలను ఇవ్వడం లేదు. గత ఏడాది గుడ్ బాయ్ సినిమా ఫలితం రష్మీకి బిగ్ షాకిచ్చింది.

ఇక ఈ ఏడాది మొదట్లోనే మిషన్ మజ్ను సినిమాతో హిట్ కొడదామనుకుంది. సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి రష్మిక నటించిన మిషన్ మజ్ఞుని దర్శకుడు శంతను బాగ్చి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన.. ఆ సినిమాకి నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్ కి మేకర్స్ పడిపోయి ఓటిటికి అమ్మేసారు. రీసెంట్ గా నెట్ ఫిక్స్ ఓటిటి నుండి రిలీజ్ అయిన మిషన్ మజ్నుకి పాజిటివ్ టాక్ రాకపోగా.. ఈ చిత్రంలో రష్మిక కంటి చూపు లేని అమ్మాయిగా కనిపించింది. సినిమా ప్రమోషన్స్ లో తెగ హడావిడి చేసిన రష్మిక మందన్న పేరు ఆ సినిమా రిలీజ్ అయ్యాక అస్సలు వినిపించలేదు.

పుష్ప ద రైజ్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన రష్మిక కాబట్టి తెలుగు ఇతర భాషల ఆడియన్స్ సినిమా మీద ఆసక్తి చూపించినా.. రష్మిక పాత్ర చూసి అందరూ ఉసూరుమన్నారు. బాలీవుడ్ లో హిట్ కొడదామని కాసుకొని కూర్చున్న రష్మిక కి మిషన్ మజ్ను కూడా షాకిచ్చేసింది. పాపం రష్మిక పరిస్థితి ఇలా తయారైందేమిటి అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Rashmika Mission Majnu public talk:

Rashmika Mandanna Mission Majnu OTT talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ