దిల్ రాజు బ్యానర్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ హీరో విజయ్ నటించిన వారిసు/వారసుడు ఈ సంక్రాంతి స్పెషల్‌గా కోలీవుడ్‌లో జనవరి 11న, తెలుగు రాష్ట్రాల్లో జనవరి 14న విడుదలైంది. వారిసు తమిళంలో యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. తెలుగులో మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. వారసుడు సినిమాని వంశీ పైడిపల్లి సీరియల్ మాదిరి తెరకెక్కించాడంటూ నెటిజెన్స్ ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ పై వంశీ పైడిపల్లి ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు.
అయితే వారసుడు హిట్ అంటూ దిల్ రాజు ప్రతి రోజు లెక్కలు వదిలాడు. వారసుడు మొదరోజు కలెక్షన్స్, ఆరో రోజు కలెక్షన్స్ అంటూ నెంబర్లు చూపించాడు. అయితే వారసుడు రిలీజ్ అయిన నెలరోజులకే ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. వారసుడు పై ఉన్న అంచనాలతో ఆ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకునేందుకు ప్రముఖ ఓటిటి సంస్థలు పోటీపడినప్పటికీ.. అమెజాన్ ప్రైమ్ భారీ డీల్‌తో వారసుడు హక్కులు దక్కించుకుంది. జనవరి 11న తమిళంలో విడుదలైన వారసుడు ఫిబ్రవరి 10 న అన్ని భాషల్లోనూ అమెజాన్ ప్రైమ్ నుండి విడుదలకు సిద్దమవుతుంది అనే న్యూస్ వినిపిస్తుంది.
వారసుడు డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. ఫిబ్రవరి 10న మాత్రం పక్కాగా అమెజాన్‌లో వారసుడు వీక్షించవచ్చు అంటున్నారు.