మంచు మనోజ్ ఈరోజు శుక్రవారం శుభవార్త చెబుతాను అంటూ ముహూర్తం పెట్టి ఊరించి ఊరించి సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. నా మనసుకు దగ్గరైంది, కొత్త ఆరంభం అంటూ ఏదేదో మాట్లాడిన మంచు మనోజ్ తన సెకండ్ మ్యారేజ్ విషయం చెబుతాడని చాలామంది ఆశపడ్డారు. ఎందుకంటే భూమా మౌనిక రెడ్డి తో మంచు మనోజ్ రెండో వివాహానికి రెడీ అయ్యాడు. ఫిబ్రవరి 2 నే మనోజ్ రెండో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చేసాయి.
అందుకే చాలామంది మనోజ్ రెండో పెళ్లి విషయమే చేబుతాడని ఎక్స్పెక్ట్ చేసారు. కానీ కూల్ గా సినిమా విషయాన్ని చెప్పాడు. దానితో మనోజ్ ని అభిమానించేవాళ్ళు చాలా డిస్పాయింట్ అయ్యారు. ఆ పెళ్లి వార్త రివీల్ చేస్తాడనుకుంటే.. ఇంత బిల్డప్ ఇచ్చి సినిమా మేటర్ బయటపెట్టడమేమిటి అంటున్నారు. ఇప్పుడు సినిమా సంగతి చెబితే చెప్పావ్ ఆ పెళ్లి వార్త కూడా చెప్పు మనోజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి పెళ్లి విషయం చేబుతాడో లేదంటే గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని కనిపిస్తాడో చూద్దాం.