చిరంజీవి పెద్ద కుమార్తె సుశ్మిత తండ్రి సినిమాలకి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో తన ప్రత్యేకతని చాటుకుంటుంది. కానీ చిరు చిన్న కుమార్తె శ్రీజ ప్రొఫెషనల్ గా ఎలాంటి ప్రత్యేకత లేకపోయినా ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం నెటిజెన్స్ కి బాగా ఇంట్రెస్టింగ్ గా మారింది. అందుకే శ్రీజ పెట్టే ఏ పోస్ట్ అయినా నిమిషాల్లో వైరల్ అవుతోంది. శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ కి విడాకులిచ్చి.. చిరు ఫ్రెండ్ కొడుకు కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లిని కూడా శ్రీజ నిలబెట్టుకోలేకపోయింది. కళ్యాణ్ దేవ్ తో విడిపోయింది.
శ్రీజ సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లకి డబుల్ మీనింగ్ తో నెటిజెన్స్ కి కొన్ని అర్ధం కానివిగా ఉంటున్నాయి. ఈ న్యూ ఇయర్ కి శ్రీజ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను, నా లైఫ్ లో ఉన్న ఆ వ్యక్తికి ధన్యవాదాలంటూ ట్వీట్ చేసింది. దానితో ఆమె మరో పెళ్ళికి సిద్దమైంది అనుకున్నారు. నాకు నేనే తోడు, ఆవ్యక్తి నాలోనే దాగుంది అంటూ వివరించింది. ఇప్పుడు తాజాగా నా అల్లరికి ప్రశాంతతని ఇస్తావ్. నీ వల్లే నేను ఉదయాన్నే లేస్తున్నాను, లైఫ్ లో వచ్చే చీకటికి నువ్వే వెలుగులు నింపుతావ్.. నా 14 ఏళ్ళ వయసులో పరిచయమయ్యావ్. అప్పటినుండి నాకు తోడుగా ఉంటున్నావ్ థాంక్యూ మై డియర్ కాఫీ అంటూ కాఫీ తనకి 14 ఏళ్ళ వయసులో పరిచయమైంది అని ట్వీట్ చేసింది శ్రీజ.
ప్రస్తుతం శ్రీజ చెప్పిన కాఫీ కబుర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.