మంచు మనోజ్ గత మూడు రోజులుగా జనవరి 20న శుభవార్త చెప్పబోతున్నట్టుగా అంబదరిలో క్యూరియాసిటీ పెంచుతున్నాడు. అయితే మంచు మనోజ్ రెండో పెళ్లి విషయమే రివీల్ చేస్తాడని అన్నారు. మంచు మనోజ్ త్వరలోనే న్యూ లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నాను అంటూ ఆసక్తిని క్రియేట్ చేసాడు. ఫిబ్రవరి 2 భూమన మౌనిక రెడ్డి తో వివాహానికి సిద్దమవుతున్నాడు.. ఈరోజు అదే పెళ్లి తేదీని సోషల్ మీడియా ద్వారా ప్రకటించనున్నాడు అనుకున్నారు. కానీ మంచు మనోజ్ పెళ్లి విషయం పక్కనబెట్టి కెరీర్ కి సంబందించిన శుభవార్తని ప్రకటించాడు.
అది నేను సినిమాలు చేసి చాలా కాలమైంది. అయినప్పటికీ మీరు నాపై ఇష్టాన్ని చూపుతూ ప్రేమని కురిపిస్తున్నారు. మీరు చూపిస్తున్న ప్రేమకు ఎంతోకొంత తిరిగివ్వాల్సిన రోజు వచ్చేసింది. వాట్ ద ఫిష్ అనే కొత్త సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ మూవీ మీ అందరికి నచ్చుతుంది. క్రేజీ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది అంటూ వాట్ ద ఫిష్ పోస్టర్ ని షేర్ చేసాడు. ఇది చూసిన ఆయన అభిమానులు ఒక విధంగా డిస్పాయింట్ అయిన.. ఎప్పటినుండో సినిమాలకి బ్రేకిచ్చి ఇప్పుడు కొత్త సినిమాతో అందరి ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నారు.
కానీ నెటిజెన్స్ మాత్రం మంచు మనోజ్ పెళ్లి వార్త చెబుతాడు అని ఎక్స్పెక్ట్ చేసాము.. సినిమాకి సంబందించిన వార్త చెప్పేసరికి వారు కూడా ఎగ్జైట్ అవుతున్నారు.