జబర్దస్త్ ఎన్నో లవ్ ట్రాక్ లు సెట్ చేసినా అందులో విపరీతంగా పాపులరైన జోడి మాత్రం రష్మీ-సుధీర్ ల జోడి. వారు పెళ్లి చేసుకోకపోయినా.. రీల్ లవర్స్ గా ఫెమస్ అయ్యారు. కానీ రియల్ లవర్స్ కాలేదు. ఎవరి ప్రొఫెషన్ లో వారు బిజీ అయ్యారు. ఇక తర్వాత ఇమ్మాన్యువల్-వర్ష ఇలా కొన్ని జంటల ట్రాక్ సెట్ చేసినా అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక రాకేష్-జోర్దార్ సుజాత ల ట్రాక్ మాత్రం వారిని నిజమైన లవర్స్ గా మార్చింది. సుజాత-రాకేష్ ల ప్రేమ వ్యవహారం జబర్దస్త్ స్టేజ్ పై ఎన్నోసార్లు చూపించినా ఆడియన్స్ నమ్మలేదు.
ఇక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఒరిజినల్ అని తేలింది. సుజాత తరుచూ రాకేష్ ఇంటికి వెళ్లడం అక్కడ పూజలు గట్రా చెయ్యడం వంటివి చెయ్యడంతో వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారని ప్రూవ్ అయ్యింది. తాజాగా సుజాత యూట్యూబ్ ద్వారా రాకేష్ తో తన పెళ్లి విషయాన్ని మరోసారి కన్ ఫర్మ్ చేసింది. ఆ వీడియోలోనే.. ఎప్పటినుంచో అనుకుంటున్న శుభ తరుణం రానే వచ్చింది, ఈ నెల చివరలో రాకేష్ తో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు సుజాత తెలియజేసింది.
ఇరు కుటుంబాల సమక్షంలో తమ నిశ్చితార్ధం జరగబోతుంది అని, నిశ్చితార్ధం అవ్వగానే పెళ్లి విషయంలో మీకు పూర్తి క్లారిటీ ఇస్తామంటూ సుజాత రాకేష్ తో పెళ్లి విషయమై స్పష్టతనిచ్చింది.