విజయ్ దేవరకొండ-రష్మిక కలిసి వరసగా రెండు సినిమాల్లో కలిసి నటించినందుకు వారి మధ్యన సం థింగ్ సం థింగ్ పుట్టలేదు పుట్టలేదు, వారిద్దరూ కలిసి వెకేషన్స్ ని ఎంజాయ్ చెయ్యడం, అలాగే విజయ్ దేవరకొండ ఫ్యామిలిలో రష్మిక కలిసి పోవడం చూసాక.. వీరిద్దరూ ఫ్రెండ్స్ కాదు అంతకు మించి అంటున్నారు జనాలు. ముంబైలో లేట్ నైట్ డిన్నర్స్ అంటూ తిరగడం ఇవన్నీ చూసాక వారి మధ్యన ఫ్రెండ్ షిప్ కాదు ఇంకేదో నడుస్తుంది అంటూ.. వారిద్దరూ వెకేషన్స్ కి కలిసి వెళ్లిన ఫొటోస్ పెట్టి మరీ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు.
కానీ రష్మిక-విజయ్ దేవరకొండ మేము మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పుకుంటున్నారు. తాజాగా ఫ్రెండ్స్ తో వెకేషన్స్ కి వెళ్లకూడదా.. విజయ్ నాకు మంచి ఫ్రెండ్, తనతో కలిసి టూర్స్ వెళ్లకూడదా, విజయ్ దేవరకొండ నాకు మంచి స్నేహితుడు, ఫ్రెండ్స్ అన్నాక టూర్స్ వెళ్లడం అనేది సర్వసాధారణమని తేల్చేసింది రష్మిక. ఇక రష్మిక ప్రస్తుతం హిందీ ఫిల్మ్ మిషన్ మజ్ను ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తుంది. అలాగే ఫిబ్రవరి నుండి పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప షూటింగ్ లో పాల్గొనబోతుంది.