మొన్న డిసెంబర్ లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెనింగ్ చేసిన రోజే టాలీవుడ్ ప్రముఖ సంస్థ మైత్రి మూవీస్ పై ఐటి అధికారులు దాడి చెయ్యడం టాలీవుడ్ కలకలం సృష్టించింది. అంతకుముందే GST అధికారులు మైత్రి మూవీస్ ఆఫీస్ లు, ఇళ్లపై అధికారులు దాడులు చేసారు. ఇప్పుడు మరో ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని అలాగే సితార ఎంటర్టైన్మెంట్ పై ఐటి దాడులు జరగడం అది కూడా మహేష్ తో చేస్తున్న SSMB28 కొత్త షెడ్యూల్ మొదలైన రోజే జరగడం అందరిలో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
సితార ఎంటర్టైన్మెంట్, హారిక అండ్ హాసిని సంస్థల యజమానులైన నాగ వంశీ, చినబాబు ఇళ్లు, ఆఫీసులన్నింటినీ సోదా చేశారు. ఈ ఐటి దాడుల్లో నిర్మాత నాగ వంశీ మై హోమ్ భుజ ఫ్లాట్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రొడక్షన్ హౌస్‌లోని కుటుంబ సభ్యుల వ్యక్తిగత లాకర్లు కూడా స్కానర్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ దాడులకు సంబంధించి మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలో పలు భారీ ప్రాజెక్ట్ లు తెరకెక్కువుతన్నాయి.