Advertisementt

జబర్దస్త్: కొత్తగా ట్రై చెయ్యండి బాస్

Wed 18th Jan 2023 09:26 PM
jabardasth  జబర్దస్త్: కొత్తగా ట్రై చెయ్యండి బాస్
Jabardasth: Try something new జబర్దస్త్: కొత్తగా ట్రై చెయ్యండి బాస్
Advertisement
Ads by CJ

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఒకప్పుడు కామెడీ షోస్ కే బాప్ అనేలా హవా కొనసాగించాయి. కానీ ఇప్పుడు జబర్దస్త్ కామెడీ కన్నా కాంట్రవర్సీలతో హైలెట్ అవుతుంది. కామెడీ తగ్గిపోవడమే కాదు, అక్కడ టాప్ కమెడియన్స్ అంటూ ఎవరూ లేరు. సుధీర్ లేడు, అందమైన యాంకర్ అనసూయ లేదు, అభి లేడు. ఇలా చాలామంది షో ని వదిలేసారు. అనసూయ ప్లేస్ లో కొత్త యాంకర్ సౌమ్య రావు దిగింది. కాస్త గ్లామర్ గా కనబడుతుంది. తెలుగు బాగానే మాట్లాడుతుంది కానీ.. ఆ మాటలు అర్ధమయ్యేలోపులో ఓ స్కిట్ వచ్చి వెళ్ళిపోతుంది.

అంత స్పీడుగా సౌమ్య రావు చక చకా మాట్లాడేస్తుంది. ఇక కామెడీ స్కిట్స్ లో పంచ్ లు లేవు, మెరుపులు లేవు. రష్మిక-సుధీర్ జోడి వెళ్లిపోయాక ఇమ్మాన్యువల్-వర్షాలను కలిపి ముడిపెట్టినా అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. రాకెట్ రాకేష్-జోర్దార్ సుజాత లు నిజంగానే జంటగా మారుతున్నా వాళ్ళ కెమిస్ట్రీలో కిక్ లేదు. ఇక నూకరాజు ఏదో కామెడీ చేస్తూ తన ఫ్యామిలీని స్టేజ్ పై నిలబెట్టి మరో కమెడియన్ తో నిశ్చితార్థం అంటూ బిల్డప్ ఇచ్చాడు.

మధ్యలో ఇంద్రజ అదేమిటి ఆ నిశ్చితార్ధం మధ్యలో అలా చేసారు. అదేనిజమైతే ఏం చేస్తారంటే.. ఇది స్కిట్ లో అని చెప్పారు, కానీ నిజమైతే కుదరదంటూ నూకరాజు ఫ్యామిలీ స్టేజ్ దిగి వెళ్లిపోయిన ప్రోమో వైరల్ అవ్వగా.. ఈ ఎపిసోడ్ రేపు శుక్రవారం టెలికాస్ట్ కాబోతుంది. ఇలా ఏదో సస్పెన్స్ క్రియేట్ చెయ్యడం కాదు.. కామెడీ డోస్ పెంచాలి. కొత్తగా ట్రై చెయ్యాలి కానీ.. ఇలాంటి స్కిట్స్ తో జబర్దస్త్ ముందుకు వెళ్లడమంటే కష్టమే సుమీ..

Jabardasth: Try something new:

Jabardasth latest promo viral

Tags:   JABARDASTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ