Advertisementt

కియారా పెళ్ళికి ముహూర్తం ఫిక్స్

Wed 18th Jan 2023 08:17 PM
sidharth malhotra,kiara advani  కియారా పెళ్ళికి ముహూర్తం ఫిక్స్
Sidharth Malhotra, Kiara Advani wedding date locked కియారా పెళ్ళికి ముహూర్తం ఫిక్స్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన ప్రేమికుడు సిద్దార్థ్ మల్హోత్రాని వివాహమాడేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటుంది అంటూ బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు సీక్రెట్ డేటింగ్ చేసుకుంటూ వెకేషన్స్ కి తిరిగినా మీడియా మాత్రం పసిగట్టేసింది. ఇప్పుడు వీరి ప్రేమ పబ్లిక్ గా తెలిసిపోవడంతో కలిసి వెళ్లే ప్రతి వెక్సేషన్ ని సోషల్ మీడియా ద్వారా బయటపెడుతోంది ఈ జంట. అయితే ఈ ఏడాది బాలీవుడ్ లో జరగబోయే మొదటి పెళ్లి కియారా-సిద్దార్థ్ లదే అంటున్నారు.

రాజస్థాన్ ప్యాలస్ లో కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు ఫిబ్రవరి 6న అంగరంగవైభవంగా వివాహం చేసుకొంటున్నారంటున్నారు. ఈ తేదీ పై ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటన లేకపోయినా.. కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రా లిద్దరూ తమ పెళ్ళికి బిటౌన్ లో ఆహ్వాన పత్రికలు పంచుతున్నారనే టాక్ వినిపిస్తుంది. అటు రాజస్థాన్ లోని జైపూర్ ప్యాలెస్ లో పెళ్లి ఏర్పాట్లు కూడా ఘనంగా మొదలైనట్లుగా తెలుస్తుంది.

కియారా అద్వానీ-సిద్దార్థ్ లు తమ పెళ్ళికి దగ్గర బంధువులను మాత్రమే అహానిస్తున్నారని, కొద్దిమంది ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్ళికి హాజరవుతారని తెలుస్తుంది. పెళ్లి తర్వాత ముంబైలో కియారా అద్వానీ-సిద్దార్థ్ ల వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహిస్తారని సమాచారం.

Sidharth Malhotra, Kiara Advani wedding date locked:

Sidharth - Kiara Advani wedding date and venue details out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ