Advertisementt

యాక్షన్ ఎపిసోడ్ తో SSMB28 స్టార్ట్

Wed 18th Jan 2023 04:22 PM
ssmb28  యాక్షన్ ఎపిసోడ్ తో SSMB28 స్టార్ట్
SSMB28 Blasting update యాక్షన్ ఎపిసోడ్ తో SSMB28 స్టార్ట్
Advertisement
Ads by CJ

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే వచ్చేసింది అంటూ మహేష్ బాబు ఫాన్స్ ఉత్సాహంగా పాటలు పాడుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడో ఆగిపోయిన SSMB28 రెగ్యులర్ షూటింగ్ కొత్త షెడ్యూల్ ఈ రోజే హైదరాబాద్ లో మొదలయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న SSMB28 రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ లోనే మొదలైంది. సెట్స్ లో మహేష్ సందడి చెయ్యడంతో ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే మొదటి షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించగా.. మహేష్ లుక్ తో పాటుగా, ఆ సీన్స్ అంత సంతృప్తికరమగా లేకపోవడంతో ఆ షెడ్యూల్ పక్కనబడేసి.. కొత్త షెడ్యూల్ లో మరోసారి యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తారు అన్నట్టుగానే త్రివిక్రం ఈ షెడ్యూల్ లో మొదలు పెట్టగానే మహేష్ పై యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది.

మహేష్ పై హై ఓల్టేజ్ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని త్రివిక్రమ్ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో పూజ హెగ్డే-శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో పూజ హెగ్డే కూడా పాల్గోనబోతుంది. కొద్దిరోజుల తర్వాత మహేష్-పూజ హెగ్డే పై త్రివిక్రమ్ కాంబో సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది. అలాగే మహేష్ కి తల్లిగా సీనియర్ హీరోయిన్ శోభనని తీసుకొస్తున్నట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా ఈ విషయమై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ssmb28

SSMB28 Blasting update :

SSMB28 update

Tags:   SSMB28
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ