Advertisementt

స్పెషల్ న్యూస్ అంటున్న మంచు మనోజ్

Wed 18th Jan 2023 02:01 PM
manchu manoj  స్పెషల్ న్యూస్ అంటున్న మంచు మనోజ్
Manchu Manoj To Announce Special News స్పెషల్ న్యూస్ అంటున్న మంచు మనోజ్
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమాల విషయంలో చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. అన్న విష్ణు జిన్నా తో హిట్ కొట్టాడు. అయినా మౌనాన్నే పాటించాడు. అటు ఫ్యామిలీ వెకేషన్స్ లోను, ఇటు సినిమా ఫంక్షన్స్ లోనూ కనబడకపోయినా మంచు మనోజ్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. కారణం అతని రెండో పెళ్లి. భూమా మౌనిక రెడ్డి తో మనోజ్ రెండో పెళ్లి ఫిబ్రవరిలో జరగబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. తరచూ మౌనిక రెడ్డితో కనబడుతున్న మనోజ్ ఆమెని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడని అంటున్నారు.

మరి ఇప్పటివరకు మంచు ఫ్యామిలీ కానీ, అటు భూమన ఫ్యామిలీ కానీ వీరి వివాహంపై స్పష్టతనివ్వలేదు. కానీ మంచు మనోజ్ మీకో స్పెషల్ న్యూస్, అది నా హృదయానికి దగ్గరైన ఓ శుభవార్తని నాలోనే దాచుకుని ఉన్నాను, జీవితంలో మరో దశలోకి ముందడుగు వెయ్యబోతున్నందుకు సంతోషం గా ఉంది. ఆ పూర్తి వివరాలను ఈ నెల 20 అంటే శుక్రవారం చెబుతాను అంటూ ముహూర్తం పెట్టి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 

మరి మనోజ్ చెప్పబోయే ఆ స్పెషల్ న్యూస్ ఏముంటుంది.. అతని రెండో పెళ్లి విషయమే. లేదంటే సినిమాలకి సంబందించిన అనౌన్సమెంట్ ఏమయినా ఉంటుందో, ఖచ్చితంగా ఈ రెండిటిలో ఏదో ఒకటి అయ్యుంటుంది అంటూ అభిమానులు ఆ స్పెషల్ న్యూస్ పై ఊహాగానాలు మొదలెట్టేసారు.

Manchu Manoj To Announce Special News:

Manchu Manoj Says Special News Reveals On January 20

Tags:   MANCHU MANOJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ