ఉప్పెన తో టాలీవుడ్ కి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన క్యూట్ కృతి శెట్టి.. వరస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. వరసగా మూడు హిట్స్ కొట్టి హ్యాట్రిక్ అందుకున్న కృతి శెట్టి అదే వరసలో మూడు ప్లాప్ లతోను హ్యాట్రిక్ కొట్టింది. ప్రస్తుతం యంగ్ హీరో నాగ చైతన్య తో కష్టడి మూవీలో నటిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పోలీస్ ఆఫీసర్ గా నాగ చైతన్య కష్టడి లుక్ ఈ మధ్యనే రిలీజ్ చేసారు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా విడుదల చేసిన గ్లిమ్ప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రం నుండి కృతి శెట్టిని రేవతిగా పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ లో కథ ని ముందుకి నడిపించే బలమైన పాత్ర లాగా ఆలోచన రేకెత్తించే లా కృతి శెట్టి కనిపించారు. ఇప్పటివరకు గ్లామర్ గా, ట్రెడిషనల్ పాత్రల్లో ఆకట్టుకున్న కృతి శెట్టి ఇప్పుడు కష్టడీలో డిఫరెంట్ గా భయపెడుతుంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.