టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరుతెచ్చుకున్న నాగ చైతన్య-సమంతలని పెట్టి క్రేజీగా శివ నిర్మాణ మజిలీ సినిమాని తెరకెక్కించాడు. మజిలి చిత్రంలో ఫస్ట్ హాఫ్ లో క్రికెటర్ గా నాగ చైతన్య ఫస్ట్ లవ్ స్టోరీ ఫెయిల్ అవగా.. సమంతని వివాహం చేసుకుని.. మొదటి ప్రేమని మరిచిపోలేక సతమతమయ్యే రఫ్ కేరెక్టర్ లో నాగ చైతన్య పెరఫార్మెన్స్, వైఫ్ గా సమంత యాక్టింగ్, ఎమోషనల్ సన్నివేశాలు అన్ని ప్రేక్షకులకి బాగా నచ్చేసాయి. ఆ తర్వాత చైతు-సమంత విడిపోయారు. అది వారి పర్సనల్ ఇష్యు.
అదలాఉంటే తెలుగులో హిట్ అయిన మజిలీ మూవీని బాలీవుడ్ క్యూట్ కపుల్ జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ లు వేద్ గా రీమేక్ చేసారు. యాజిటీజ్ గా మజిలీని కాపీ పేస్ట్ చేసారు. ట్రైలర్ దగ్గరనుండి ప్రమోషన్స్ అన్ని ఆకట్టుకున్నాయి. జనవరి మొదటి వారంలో విడుదలైన వేద్ కి మంచి రివ్యూస్ రావడమే కాదు, అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. భార్య, భర్తలుగా జెనీలియా-రితేష్ లు ఒరిజినల్ చైతు-సమంతలని మరిపించేలా చేసిన పెరఫార్మెన్స్ కి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
మజిలీలో సోల్ మిస్ అవ్వకుండా వేద్ ని తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమవడంతో సినిమాకి మంచి టాక్ తో పాటుగా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక్క హిట్ అయిన మజిలీ బాలీవుడ్ లో మాత్రం వేద్ గా సూపర్ హిట్ అయ్యింది.