Advertisementt

వారసుడు ట్రోల్స్ పై వంశీ పైడిపల్లి ఫైర్

Wed 18th Jan 2023 10:11 AM
vamsi paidipally,social media  వారసుడు ట్రోల్స్ పై వంశీ పైడిపల్లి ఫైర్
Frustrated Vamshi Paidipally fires on a media reporter వారసుడు ట్రోల్స్ పై వంశీ పైడిపల్లి ఫైర్
Advertisement
Ads by CJ

దిల్ రాజు నిర్మాణంలో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన వారిసు/వారసుడు సినిమా ఈ సంక్రాంతికి తెలుగు, తమిళంలో విడుదలైంది. తమిళంలో వారిసు కి మిక్స్డ్ టాక్ రాగా.. తెలుగులో ప్లాప్ టాక్ రావడంతో పాటు విమర్శకులు సైతం వారసుడు డైలీ సీరియల్ లా ఉంది అనేసారు. ఆడియన్స్ కూడా సోషల్ మీడియాలో వారసుడు పై చాలా ట్రోల్స్ చేసారు. వంశీ పైడిపల్లి డైలీ సీరియల్ తీసాడంటూ ట్రోల్ చేసారు. 

తాజాగా వంశీ పైడిపల్లి వారసుడు ట్రోల్స్ పై ఫైర్ అయ్యాడు. డైలీ సీరియల్స్ ని ఎంతోమంది ఆదరిస్తున్నారు కానీ.. సినిమా తియ్యడం అంటే చిన్న విషయమేమి కాదు, సినిమాలు తియ్యడం వెనుక ఎన్నో త్యాగాలు చెయ్యాలి, ఉంటాయి. సినిమా చెయ్యడం అనేది టీం వర్క్. ఈరోజుల్లో సినిమాలు తియ్యడానికి మించి కష్టమైన పని ఇంకొకటి లేదు. ప్రేక్షకులని శాటిస్ఫాయ్ చెయ్యడానికి ఎంతో కష్టపడాలి. ఇండియాలో సూపర్ స్టార్స్ లో విజయ్ కూడా ఒకరు. ప్రతి సన్నివేశానికి రిహార్సల్ చెయ్యాలి. 

మనం ఏం చేయగలమో అదే మన చేతుల్లో ఉంటుంది. రిజల్ట్ మాత్రం మన చేతుల్లో ఉండదు. ఆయన కోసమే సినిమా చేశాను. ఆయనే నా సినిమాకి మొదటి విమర్శకుడు, సమీక్షకుడు. మరీ ఇంత నెగెటివ్ గా ఉండకండి.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికే సినిమా చేశాను. సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని సినిమాలు చెయ్యడానికి వచ్చాను.. నేనేంటో నాకు తెలుసు అంటూ వంశీ పైడిపల్లి వారసుడు ట్రోలర్స్ పై విరుచుకుపడ్డాడు. 

Frustrated Vamshi Paidipally fires on a media reporter:

Frustrated Vamsi Paidipally fires on a social media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ