మెగాస్టార్ ఇంట ఇప్పుడు సంతోషకరమైన వాతావరణ కనిపిస్తుంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు గుడ్ న్యూస్ చెప్పినప్పటినుండి మెగాస్టార్ దంపతులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఉపాసన బేబీ బంప్ ఫొటోస్ తరచూ సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. రీసెంట్ గానే చరణ్-ఉపాసనలు అమెరికా వెళ్లి ట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు ని రాజమౌళి, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో కలిపి అందుకుని అక్కడ ఎంజాయ్ చేసొచ్చారు. రీసెంట్ గానే హైదరాబాద్ లో చరణ్ భార్యతో అడుగుపెట్టాడు.
అయితే చరణ్ కి కొడుకు పుట్టాలని, తమకి మేనల్లుడు పుడితే బావుంటుంది అని కోరుకుంటున్నట్లుగా రీసెంట్ గా వాల్తేర్ వీరయ్య ప్రమోషన్స్ లో మెగాస్టార్ పెద్ద కూతురు సుశ్మిత చెప్పింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ రామ్ చరణ్ తండ్రి అయ్యేది ఏ నెలలోనే అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లితండ్రులవుతున్న విషయం తెలిసి మా ఇంటిల్లిపాదికి ఆనందం కలిగించింది, మాకు ఈ శుభవార్త చాలా ఎమోషనల్ గా మారింది. రాంచరణ్, ఉపాసన దంపతులు ఇద్దరూ 2023లో శుభవార్తను అందిస్తారు.
బహుశా ఆగస్టులో కానీ, జూలై గానీ ఆ శుభవార్త అందించే అవకాశం ఉంది. నేను పుట్టిన నెల ఆగస్టు అయితే ఇంకా బాగుంటుందని అనుకొంటున్నాను. కానీ ఆగస్టుకు ఒక నెల అటు గానీ..ఇటు గానీ ఉండవచ్చు. ఏ నెలలో డెలివరీ అయినా, ఏది ఏమైనా మా ఇంటిలో ప్రస్తుతం ఆనందకరమైన వాతావరణం ఉంది అని చిరంజీవి చెప్పారు.