Advertisementt

వీరయ్య టు భోళా శంకర్

Tue 17th Jan 2023 05:22 PM
chiranjeevi,bholaa shankar  వీరయ్య టు భోళా శంకర్
Bholaa Shankar Shooting Resumes Today వీరయ్య టు భోళా శంకర్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేర్ వీరయ్యని, ఆడియన్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా గుండెల్లో పెట్టుకున్నారు. అటు కలెక్షన్స్ సునామీతో వాల్తేర్ వీరయ్య రోజు రోజుకి నెంబర్లు పెంచుకుంటూ పోతుంది. వాల్తేర్ వీరయ్య ప్రమోషన్స్ అలాగే సక్సెస్ సెలెబ్రేషన్స్ తో మెగాస్టార్ హడావిడి చేసారు. ఇక సంక్రాంతి పండుగ ముగిసిందో లేదో.. చిరంజీవి మరో క్రేజీ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టేసాడు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోలా శంకర్ షూటింగ్ ఈరోజు పునఃప్రారంభమైంది. మెగా బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్ వైబ్‌ను కొనసాగిస్తూ హై పాజిటివ్ ఎనర్జీతో రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని భారీ కోల్‌కతా సెట్‌లో ప్రారంభమైయింది.

వాల్తేరు వీరయ్యతో చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ సాధించడంతో భోళా శంకర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెహర్ రమేష్,  చిరంజీవిని స్టైలిష్, ఇంకా మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా కథానాయికగా కనిపించనుంది.

Bholaa Shankar Shooting Resumes Today:

Megastar Bholaa Shankar Shooting Resumes Today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ