Advertisementt

పుష్ప2 పై సూపర్ అప్ డేట్ ఇచ్చిన రష్మిక

Tue 17th Jan 2023 03:53 PM
rashmika mandanna,pushpa fans  పుష్ప2 పై సూపర్ అప్ డేట్ ఇచ్చిన రష్మిక
Rashmika gave a super update on Pushpa 2 పుష్ప2 పై సూపర్ అప్ డేట్ ఇచ్చిన రష్మిక
Advertisement
Ads by CJ

పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా హిట్ కొట్టి ఏడాది దాటిపోతున్నా పుష్ప ద రూల్ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటివరకు ప్రోపర్ గా పట్టాలెక్కలేదు. అక్టోబర్ నుండి పుష్ప రాజ్ ఫొటో షూట్స్, ఇంకా సుకుమార్ మిగతా విషయాలను చూస్తున్నా.. డిసెంబర్ లో నాలుగు రోజులపాటు అల్లు అర్జున్ షూటింగ్ లో పాల్గొన్నా ఇప్పటివరకు మొదటి షెడ్యూల్ అయిన దాఖలాలు లేవు. పుష్ప పార్ట్ 1 లో శ్రీవల్లిగా అందరి మనసులు దోచేసిన రష్మిక మందన్న పుష్ప 2 కి సంబందించిన సూపర్ అప్ డేట్ ఇచ్చింది.

వారిసు చిత్రం సక్సెస్ తో ఊపుమీదున్న రష్మిక మందన్న బాలీవుడ్ లో తెరకెక్కిన మిషన్ మజ్ను ప్రమోషన్స్ తో హడావిడి చేస్తుంది. ఆ మిషన్ మజ్ను డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు రష్మిక పుష్ప ద రూల్ పైనే నమ్మకం పెట్టుకుంది. ప్ర‌స్తుతం పుష్ప 2 షూటింగ్ జ‌రుగుతుంద‌ని.. తాను మాత్రం ఫిబ్ర‌వ‌రి నుంచి పుష్ప పార్ట్ 2 షూటింగ్‌లో పాల్గొంటాన‌ని, ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు, షూటింగ్ కోసం ఎంత‌గానో వెయిట్ చేస్తున్నాను అంటూ రష్మిక అప్ డేట్ ఇవ్వడంతో అల్లు ఫాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు.

మరి పుష్ప ద రూల్ మేకర్స్ సినిమాపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోయినా.. రష్మిక మాత్రం పుష్ప షూటింగ్ పై సూపర్ అప్ డేట్ ఇచ్చేసింది.

Rashmika gave a super update on Pushpa 2:

Rashmika Mandanna has good news for all Pushpa fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ