ఈ సంక్రాంతి సందర్భంగా సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి-నటసింహ నందమూరి బాలకృష్ణ లు బాక్సాఫీసు ఫైట్ కి దిగారు. గోపీచంద్ మలినేని తో కలిసి బాలకృష్ణ వీరసింహరెడ్డిగా వీర విహారం చెయ్యగా.. బాబీ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యగా పూనకాలు తెప్పించారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ కామన్ పాయింట్ ఒకటే. వీరసింహారెడ్డి-వాల్తేర్ వీరయ్య సినిమాల రిలీజ్ లకి ముందే సినీజోష్ ఆ కామన్ పాయింట్ ఏమిటనేది బయటపెట్టింది. అదే రెండు సినిమాల్లోనూ ఒకేరకమైన సెంటిమెంట్ ఉంటుంది. వీరసింహారెడ్డిలో అన్నా చెల్లెళ్ళ ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటే.. వాల్తేర్ వీరయ్యలో అన్నదమ్ముల సెంటిమెంట్ తో గోపీచంద్ మలినేని-బాబీ లు కథలు అల్లారు.
సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ వీరసింహారెడ్డిలో సిస్టర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటించగా.. చెల్లెలి ద్వేషానికి గురయ్యే పాత్రలో బాలయ్య ఎమోషన్స్ పండించారు. ఇటు వాల్తేర్ వీరయ్యలో మెగాస్టార్-రవితేజ అన్నదమ్ములుగా నటించారు. ఇద్దరూ పోటీపడినా.. చివరికి అన్నదమ్ముల సెంటిమెంట్ బలంగా కనబడింది. సో ఈ సంక్రాంతి సినిమాలు రెండూ ఒకేరకైనా ఎమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు రాగా.. అందులో బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. అంటే వాల్తేర్ వీరయ్యలో చిరు-రవితేజల బంధం బాగా కనెక్ట్ అయ్యింది. కానీ వీరసింహారెడ్డిలో మాత్రం అది ఓవర్ డోస్ అయినట్లుగా ప్రేక్షకులు ఫీలయ్యారు.
ఏది ఏమైనా అక్కడ వీరసింహారెడ్డిలో సిస్టర్ సెంటిమెంట్ ఉంటే ఇక్కడ వాల్తేర్ వేరయ్యాలో బ్రదర్ సెంటిమెంట్ అన్నమాట.