Advertisementt

నెక్స్ట్ మంత్ కి షిఫ్ట్ అయిన విజయ్ ఖుషి

Tue 17th Jan 2023 01:12 PM
vijay deverakonda,kushi update  నెక్స్ట్ మంత్ కి షిఫ్ట్ అయిన విజయ్ ఖుషి
Kushi new schedule to start during this time నెక్స్ట్ మంత్ కి షిఫ్ట్ అయిన విజయ్ ఖుషి
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ కలయికలో సమంత హీరోయిన్ గా కాశ్మీర్ లో మొదలైన ఖుషి చిత్రం మొదట పోస్టర్ తోనే అందరిని ఆకట్టుకుంది. లైగర్ సినిమా విడుదలకు ముందే ఖుషి కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ లైగర్ మూవీ విడుదల తర్వాత అనుకుంటే.. ఆ సినిమా పోవడంతో విజయ్ కొద్దిగా డిస్పాయింట్ అయినా.. వెంటనే ఖుషి షూట్ కి రెడీ అయ్యాడు. కానీ హీరోయిన్ సమంత హెల్త్ ప్రోబ్లెంస్ తో ఖుషి షూటింగ్ చాలా రోజులపాటు వాయిదా పడింది.

సమంత పూర్తి ఆరోగ్యనతురాలిగా ఖుషి సెట్స్ లోకి అడుగుపెట్టేవరకు ఖుషి షూటింగ్ హోల్డ్ లో పెట్టేసారు. దానితో విజయ్ దేవరకొండ కూడా ఖాళీగానే ఉండిపోయాడు. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ VD12 ని గౌతమ్ తిన్ననూరితో అనౌన్స్ చేసాడు. అయితే ఖుషి షూటింగ్ కి సమంత సంక్రాంతి తర్వాత నుండి జాయిన్ అవుతుంది అని మేనేజర్ చెప్పినప్పటికీ.. ఇప్పుడు ఈ ఖుషి కొత్త షెడ్యూల్ ఫిబ్రవరి నెలాఖరుకి షిఫ్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి చివరి వారం నుండి ఖుషి కొత్త షెడ్యూల్ కి శివ నిర్వాణ ప్లాన్ చేస్తున్నాడట. 

అప్పటిలోగా సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగివస్తుంది అని తెలుస్తుంది. ఇక ఖుషి గత డిసెంబర్ లోనే విడుదలవుతుంది అని మేకర్స్ ప్రకటించినా.. అది ఇప్పుడు దసరాకి విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది.  

Kushi new schedule to start during this time:

Vijay Deverakonda Kushi update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ