కోలీవుడ్ హీరో విజయ్ టాలీవుడ్ మేకర్స్ దిల్ రాజు, వంశి పైడిపల్లితో చేసిన వారిసు చిత్రానికి తమిళనాట మంచి మార్కులు పడగా తెలుగులో మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. విజయ్ వారసుడుగా తెలుగు ఆడియన్స్ ముందుకు ఈ సంక్రాంతి స్పెషల్ గా భోగి రోజున ఆర్భాటంగా వచ్చాడు. బాలకృష్ణ-చిరంజీవి లాంటి సీనియర్ స్టార్స్ సినిమాలు ఉన్నప్పటికీ.. అంత పెద్ద పోటీలోనూ విజయ్ వారసుడు స్ట్రాంగ్ గా నెంబర్ నోట్ చేస్తున్న విషయాన్ని దిల్ రాజు బయటపెడుతున్నాడు. మూడు రోజులుగా వారసుడు కలెక్షన్స్ ని డే 1 ఇంత, డే2 ఇంత అంటూ ఇప్పుడు మూడు రోజుల లెక్కలని కూడా వదిలాడు. విజయ్ వారసుడు మూడు రోజుల రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ మీ కోసం..
ఏరియా 3 డేస్ కలెక్షన్స్
నైజాం 3.61 కోట్లు
సీడెడ్ 1.43 కోట్లు
ఉత్తరాంధ్ర 1.35 కోట్లు
ఈస్ట్ గోదావరి 59 లక్షలు
వెస్ట్ గోదారి 45 లక్షలు
గుంటూరు 55 లక్షలు
కృష్ణా 56 లక్షలు
నెల్లూరు 42 లక్షలు
3 డేస్ AP-TG టోటల్ షేర్ 8.9 కోట్లు