యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఇండియా వైడ్ గా కొమరం భీమ్ ని ఇష్టపడని వారు లేరు. రీసెంట్ గానే ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, కొడుకులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో అమెరికా ట్రిప్ వేసాడు. అక్కడే క్రిష్టమస్ సెలెబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ తో పాటుగా.. నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో రాజమౌళి, రామ్ చరణ్ ఫ్యామిలీలతో కలిసి అమెరికాలో సందడి చేసాడు. భోగి రోజున ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. సంక్రాంతి సెలెబ్రేషన్స్ ని ఫ్యామిలీతో కలిసి చేసుకున్న ఎన్టీఆర్ ఫిబ్రవరి నుండి NTR30 షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతారు.
తాజాగా యంగ్ టైగర్ టీమ్ ఇండియా క్రికెటర్స్ ని మీట్ అయ్యారు. టీమ్ ఇండియా సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఇక్కడ ఉప్పల్ జరగబోయే మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చారు. వీరంతా ఎన్టీఆర్ తో కలిసి ఫోటో దిగడం హాట్ టాపిక్ అయ్యింది. టీమ్ ఇండియా క్రికెటర్స్ తో ఎన్టీఆర్ ఓ కార్ల షో రూమ్ లో దిగిన ఫోటోలా ఉంది. అయితే వీరు ఎక్కడ కలిశారన్నది క్లారిటీ లేకపోయినా.. టీమ్ ఇండియా సభ్యుల్లోని సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభమాన్ గిల్ తో పాటుగా పలువు టీమ్ ఇండియా సభ్యులతో ఎన్టీఆర్ దిగిన పిక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.