2023 సంక్రాంతికి కుర్ర హీరోలెవరూ రేస్ లోకి రాకపోయినా సీనియర్ హీరోలు మాత్రం బాక్సాఫీసు ఫైట్ కి దిగారు. కోడిపందేల బరిలో ఏ కోడి గెలుస్తుందో అనే క్యూరియాసిటీ ఉన్నట్టే ఈ బాక్సాఫీసు బరిలో ఎవరు విన్ అవుతారో అని అందరూ కాచుకుని కూర్చుకున్నారు. ఈ సంక్రాంతి కి ముందుగా తమిళం నుండి అజిత్ తెగింపుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి తమిళ్ లో రికార్డ్ కలెక్షన్స్ వచ్చినా తెలుగులో మొదటి రోజే డల్ అయ్యింది. ఇక ఆ తర్వాత రోజు జనవరి 12న వీర సింహ రెడ్డి గా బాలయ్య బాబు వచ్చాడు.
వీరసింహారెడ్డి కూడా అభిమానులకి నచ్చాడు కానీ.. సాధారణ ప్రేక్షకుడు ఓకె అన్నాడు. మొదటి రోజు బాలయ్యకి సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ తర్వాత రోజు జనవరి 13న వాల్తేర్ వీరయ్య తో మెగాస్టార్ దిగారు. చిరు, రవితేజ తో రాంప్ ఆడిస్తూ వాల్తేర్ వీరయ్య బరిలోకి దిగింది. దానికి మిక్స్డ్ రివ్యూస్ పడినాయి. కానీ మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాకు ఓటెయ్యడంతో మూడు రోజుల్లోనే చిరంజీవి వాల్తేర్ వీరయ్య 108 కోట్ల షేర్ తో వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ కొల్లగొట్టింది. నాలుగు రోజులకి వీరసింహారెడ్డి 104 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకుంది.
ఇక దిల్ రాజు వారసుడు తెలుగులో 14న విడుదలైంది. ఆ సినిమాకి పూర్ రివ్యూస్ వచ్చాయి. కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. మరో చిన్న సినిమా కళ్యాణం కమనీయం కూడా పెద్ద హీరోల సుడిగుండంలో కొట్టుకుపోయింది. ఫైనల్ గా ఈ పొంగల్ కి మెగాస్టార్ చిరు వాల్తేర్ వీరయ్యనే విన్నర్. ఈ రోజు కనుమ రోజు కూడా వాల్తేర్ వీరయ్య థియేటర్స్ ఆక్యుపెన్సీ బావుంది. కానీ వీరసింహారెడ్డి మాత్రం డల్ అయ్యింది. ఇక రేపటి నుండి అంటే మంగళవారం నుండి ఆఫీస్ లు, స్కూల్స్ అన్ని తెరుచుకుంటాయి. రేపటి నుండి థియేటర్స్ లో నిలబడేది విన్నర్ అవుతుంది కానీ.. ఎటు చూసినా ఈ సంక్రాంతికి ఫైనల్ విన్నర్ మాత్రం వాల్తేర్ వీరయ్యనే అని ప్రేక్షకులు తేల్చేసారు.