టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కోలీవుడ్ కి వెళ్లి అక్కడి హీరో విజయ్ తో వారిసు సినిమాతో ఫస్ట్ డెబ్యూ కోలీవుడ్ హిట్ అందుకున్నాడు. అదే సినిమాని తెలుగులో రిలీజ్ చేసి ప్లాప్ కొట్టాడు. అయితే దిల్ రాజు ఎప్పుడూ ఏ సందర్భంలోను ఫ్యామిలీ విషయాలను బయటపెట్టడు. ఆయన తన మొదటి భార్య అనిత చనిపోయాక మూడేళ్లు ఒంటరిగా ఉండి తర్వాత తేజస్వీనిని రెండో పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించాడు. అయితే తేజస్వినితో తన ప్రేమ, పెళ్లి విషయాలపై తాజాగా దిల్ రాజు ఇంట్రెస్టింగ్ సంగతులు బయటపెట్టాడు.
తన భార్య అనిత చనిపోయాక రెండేళ్లపాటు లైఫ్ లో స్ట్రగుల్ అయ్యాను. అనిత చనిపోయే సమయానికి నా వయసు 47 ఏళ్ళు, లైఫ్ లో ముందడుగు వెయ్యాలనుకున్నప్పుడు రెండు మూడు ఆప్షన్స్ కనిపించాయి. కానీ నేను ఓ సెలెబ్రిటీని, నన్ను జీవితంలో అర్ధం చేసుకునే వాళ్ళు ఉంటే బావుంటుంది అనుకున్నాను. అప్పుడే తేజస్విని నాకు తారసపడింది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాను, ఓ ఏడాది పాటు తేజస్విని అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత ఆమెకి ప్రపోజ్ చేశాను. తేజస్వినీని పెళ్లి చేసుకోవడానికి అందరిని ఒప్పించాను.
తాను నాకు మంచి వైఫ్ అవుతుంది అని నమ్మాను, ఇప్పుడు మాకో బాబు పుట్టాడంటూ దిల్ రాజు తన పర్సనల్ విషయాలను మీడియా కి షేర్ చేసాడు.