పుష్ప తో పాన్ ఇండియా స్టార్ అయ్యి గత ఏడాది అదే క్రేజ్ తో లెక్కకు మించి పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ షూట్స్ చేసిన అల్లు అర్జున్ ఆ ఏడాది ఎక్కువగా ఫ్యామిలీతోనే టైమ్ స్పెండ్ చేసాడు. భార్య పిల్లలతొ కలిసి సౌత్ ఆఫ్రికా టూర్ ఇలా ఎక్కువగా విదేశీ ట్రిప్స్ వేసాడు. భార్య స్నేహ రెడ్డి, పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి తరచూ సందడి చేసే అల్లు అర్జున్ ఈ పొంగల్ ని అత్తగారి ఫ్యామిలీతో జరుపుకున్నట్లుగా తెలుస్తుంది.
భార్య స్నేహ రెడ్డి పేరెంట్స్ కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే ఈసారి సంక్రాంతికి అల్లు అర్జున్ భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్ తో కలిసి అత్తగారింటికి వెళ్లి సెలెబ్రేట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అత్త, మామలతో కలిసి అల్లు అర్జున్ ఫ్యామిలీ తీయించుకున్న స్పెషల్ ఫెస్టివ్ పిక్, ఇంకా స్నేహ రెడ్డి తన ఫ్రెండ్స్ తో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్నేహ, అల్లు అర్జున్ ఇద్దరూ ట్రెడిషనల్ గా కనిపించారు.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. ఈ నెలలోనే సుకుమార్ తో అల్లు అర్జున్ ప్రోపర్ గా పుష్ప 2 సెట్స్ మీదకి వెళ్లబోతున్నాడు.