Advertisementt

మహేష్ సినిమాలో శ్రీలీల ఫిక్స్

Mon 16th Jan 2023 03:35 PM
sreeleela,mahesh babu,ssmb28  మహేష్ సినిమాలో శ్రీలీల ఫిక్స్
Sreeleela confirmed as lead for Mahesh Babu Movie మహేష్ సినిమాలో శ్రీలీల ఫిక్స్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో ముచ్చగా మూడో చిత్రంగా SSMB28 తెరకెక్కడానికి సిద్ధంగా ఉంది. జనవరి 18 బుధవారం నుండి SSMB28 కొత్త షెడ్యూల్ ప్రపారంభం కానుంది. సెప్టెంబర్ చివరిలో SSMB28 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా..ఆ మధ్యలో మహేష్ పర్సనల్ ప్రోబ్లెంస్ తో షూటింగ్ వాయిదా పడింది. సంక్రాంతి ముగియగానే మహేష్-త్రివిక్రమ్ రంగంలోకి దిగిపోతున్నారు. ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే నటించనుండగా.. సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలని అనుకున్నారు. ఈ అమ్మాయి SSMB28 లో సెకండ్ హీరోయిన్ అని అధికారికంగా రాకపోయినా.. త్రివిక్రమ్ ఆ అమ్మాయి కోసం మంచి నిడివి ఉన్న కేరెక్టర్ రాసారని అన్నారు.

అయితే ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్స్ వలన మహేష్ సినిమాలో నటించలేను, డేట్స్ అడ్జెస్ట్ చెయ్యడం కుదిరే పని కాదు అంటూ సెకండ్ హీరోయిన్ గా చెయ్యడం ఇష్టం లేదు అన్నట్టుగా ఈ చిత్రం నుండి శ్రీలీల తప్పుకుంది అన్నారు. కానీ SSMB28 నిర్మాత నాగ వంశీ మాత్రం తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకి హీరోయిన్స్ కి నెంబర్లు ఇవ్వడం ఇష్టం లేదు, మహేష్ సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ కాదు, ఆమె కూడా వన్ అఫ్ ద హీరోయిన్ మాత్రమే అంటూ చెప్పడంతో శ్రీలీల మహేష్ సినిమాలో నటిస్తుంది అని క్లారిటీ వచ్చేసింది.

ప్రస్తుతం ధమాకాతో అదరగొడుతున్న శ్రీలీల ఇకపై యంగ్ హీరోలకే కాదు స్టార్ హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది అనే చెప్పాలి.

Sreeleela confirmed as lead for Mahesh Babu Movie :

Sreeleela confirmed as lead for Mahesh-Trivikram SSMB28

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ