తమిళ హీరోతో వారిసు చిత్రాన్ని నిర్మించి దానిని తెలుగులో డబ్బింగ్ వారసుడుగా రిలీజ్ చేసిన దిల్ రాజు ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే డబ్బింగ్ సినిమాలను ఫెస్టివల్ సమయంలో రిలీజ్ చేయకూడదనే తన వ్యాఖ్యలను తానే ఫాలో అవ్వకపోవడంతో పాటుగా.. చిరంజీవి-బాలకృష్ణ లకి ఎదురెళ్లి మరీ వారసుడు సినిమాని తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి రిలీజ్ చేసాడు. అయితే తమిళనాట పర్వాలేదనిపించుకున్న వారిసుకి తెలుగులో మాత్రం పూర్ రివ్యూస్ వచ్చాయి.
కనీసం మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన వారసుడు సేఫ్ అయ్యేవాడే అనుకున్నారు. కానీ ఆడియన్స్ నుండి వారసుడు సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. వారసుడు సినిమా చాలా సినిమాలను మిక్సీ లో వేసినట్టుగా వంశి పైడిపల్లి తెరకెక్కించాడని తేల్చేసారు. ఇంత జరిగినా దిల్ రాజు వారసుడు రెవిన్యూని బయటపెడుతున్నాడు. మొదటిరోజు వారసుడు మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్లకి పైగా కొల్లగొట్టినట్లుగా ఏరియాల వారీగా లెక్కలు వదిలిన దిల్ రాజు రెండో రోజు కూడా వారసుడు కలెక్షన్స్ ని అధికారికంగా చూపించాడు.
అటు వీర సింహ రెడ్డి, ఇటు వాల్తేర్ వీరయ్యల లెక్కలు మేకర్స్ బయటికి రానివ్వడం లేదు. రెగ్యులర్ గా కలెక్షన్స్ చూపించే వెబ్ సైట్స్ కూడా ఈ రెండు సినిమాల కలెక్కలు చూపించలేదు. కానీ దిల్ రాజు వారసుడు మూవీ రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.4 కోట్లు కలెక్షన్స్ తెచ్చినట్టుగా చూపించాడు. ఇది చూసిన నెటిజెన్స్ ధైర్యంగా దిల్ రాజు వారసుడు లెక్కలు చూపిస్తున్నాడుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.