అర్జున్ రెడ్డి, గీత గోవిందం, భరత్ అనే నేను, ట్రిపుల్ ఆర్ సినిమాలతో కమెడియన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతున్న రాహుల్ రామకృష్ణ కి కొద్దిగా నోటి దురద ఎక్కువ,. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటాడు. రాహుల్ రామకృష్ణ తన పేరు హైలెట్ అయ్యేందుకు అలా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటాడు అంటూ చాలామంది అంటారు. సినిమా ఇండస్ట్రీని వదిలేస్తున్నా అంటూ పోస్ట్ పెడతాడు.. అంతలోనే కామెడీ అంటాడు. అటు సినిమాల్లోనే కాదు, ఇటు బయట కూడా మంచి కామెడీ చెయ్యగలడు.
అయితే రాహుల్ రామకృష్ణ గత ఏడాది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఇప్పుడు తాజాగా తండ్రి అయ్యాడు. తనకి అబ్బాయి పుట్టినట్లుగా రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. Boy. Sankranthi release. అబ్బాయి పుట్టాడని.. సంక్రాంతి రిలీజ్ అంటూ సినిమా స్టయిల్లో పోస్ట్ పెట్టాడు రాహుల్ రామకృష్ణ. దానితో ఈ కమెడియన్ కి స్నేహితులు, సన్నిహితులు, సినిమా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.