సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది ఘట్టమనేని ఫ్యామిలిలో జరిగిన మరణాలతో తీవ్రంగా కలత చెందారు. సర్కారు వారి పాట హిట్ తర్వాత ఇమ్మిడియట్ గా త్రివిక్రమ్ తో SSMB28 చెయ్యాల్సి ఉంది. జూన్ లోనే అనుకున్న ఆ మూవీ రెగ్యులర్ షూటింగ్ అలా అలా సెప్టెంబర్ కి వెళ్ళింది. సెప్టెంబర్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ కి నెలల గ్యాప్ లో తల్లితండ్రుల మరణంతో ఆ షెడ్యూల్ నిరవధికంగా వాయిదాపడింది. మళ్ళీ జనవరిలో సెకండ్ షెడ్యూల్ మొదలు పెడతామని మేకర్స్ చెప్పినప్పటికీ ఖచ్చితమైన తేదీ ఇవ్వకుండా మహేష్ అభిమానులని డిస్పాయింట్ చేసారు. ఎప్పుడెప్పుడు మహేష్ SSMB28 సెట్స్ మీదకి వెళతారా అని ఆయన అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.
అయితే తాజాగా SSMB28 సెకండ్ షెడ్యూల్ ఈ నెల 18 నుండి అంటే బుధవారం నుండి హైదరాబాద్ లో మొదలు కాబోతుంది, ఆగష్టు 11న SSMB28 రిలీజ్ డేట్ అంటూ నిర్మాత నాగ వంశి ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో మహేష్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇంతకుముందు ఏప్రిల్ 27 SSMB28 రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించినా షూటింగ్ లేట్ అవడంతో ఇప్పుడా డేట్ మారినట్లుగా తెలుస్తుంది. ఈ షెడ్యూ లో హీరోయిన్ పూజ హెగ్డే కూడా పాల్గొనబోతుంది. ఇంకా ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శోభన నటించే అవకాశాలు ఉన్నాయని, త్రివిక్రమ్ ఆ విషయంలో శోభనతో చర్చిస్తున్నారని టాక్ నడుస్తుంది. అలాగే మరో హీరో కూడా నటించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం.