చిరంజీవికి ఆచార్య డిసాస్టర్ విషయంలో కొరటాల శివపై చాలా కోపం ఉంది. కొరటాల శివని డైరెక్ట్ గా ఏమి అనరు. కానీ ఇండైరెక్ట్ గా కొరటాలని చిరంజీవి పదే పదే టార్గెట్ చేస్తున్నారు. నేను కొరటాలని కాదు అనేది, అందరి డైరెక్టర్స్ ని అంటున్నాను అంటున్నారు కానీ.. ఆచార్య విడుదలకు ముందు ఏ డైరెక్టర్ ని పల్లెత్తి మాట అనని చిరంజీవి ఆచార్య డిసాస్టర్ తర్వాతే దర్శకులకి పదే పదే సలహాలు ఇవ్వడం చూసిన వారు మాత్రం కొరటాలని చిరంజీవి కావాలనే అంటున్నారని ఫిక్స్ అవుతున్నారు. ఆయన ఏ పబ్లిక్ ఈవెంట్ కి వచ్చినా కొరటాల శివపై ఇండైరెక్ట్ కామెంట్స్ పేలుస్తున్నారు. ఆచార్య డిసాస్టర్ అవ్వడానికి కారణం కొరటాలే అనేది చిరు ఫీలింగ్. కాబట్టే పదే పదే ఆయనని అంటున్నారు.
తాజాగా వాల్తేర్ వీరయ్య సక్సెస్ సెలెబ్రేషన్స్ లోను చిరు అదే తీరు ప్రదర్శించారు. చాలామంది నేను మాట్లాడిన మాటలకి హార్ట్ అవుతారేమో, సీనియర్స్ అయినా, లేదు యంగ్ డైరెక్టర్స్ ఎవ్వరైనా.. సినిమా అనేది డైరెక్టర్ హిట్ ఇవ్వడం కాదు, అలాగే అదిరిపోయే కథ ఇవ్వడం కాదు, అన్నీ ఓకె అనుకున్నాక సినిమాని అనుకున్న టైమ్ లోనే పూర్తి చేసి ఇస్తే.. నిర్మాతలపై భారం పడదు. అంతేకాకుండా అనుకున్న బడ్జెట్ లోనే సినిమా తియ్యాలి. అదే మీ మొదటి సక్సెస్. ప్రొడ్యూసర్స్ బావుంటేనే ఇండస్ట్రీ బావుంటుంది. వాల్తేర్ వీరయ్య సినిమాతో నిర్మాతలకు ఒక్క పైసా కూడా వృధా కాలేదు.. అంటూ మరోమారు కోరటాలని చిరు ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసారా అనేలా మట్లాడారు.
మరి నేను కొరటాలకి అనడం లేదు అంటూనే పదే పదే చిరు ఎందుకిలా మాట్లాడుతన్నారో కానీ ఆచార్య విషయంలో మాత్రం కొరటాల శివ తప్పెంతుందో కానీ, ఆయన కెరీర్ కి ఓ పెద్ద మచ్చలా ఆచార్య డిసాస్టర్ తయారైంది అనడంలో సందేహం లేదు.