Advertisementt

ఆ టాక్ ఏంటి? ఆ కలెక్షన్స్ ఏంటి?

Sun 15th Jan 2023 05:20 PM
ajith,thunivu  ఆ టాక్ ఏంటి? ఆ కలెక్షన్స్ ఏంటి?
What is that talk? What are those collections? ఆ టాక్ ఏంటి? ఆ కలెక్షన్స్ ఏంటి?
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో ఈసారి పొంగల్ ఫైట్ రసవత్తరంగా మారింది. అజిత్ ఫాన్స్ vs విజయ్ ఫాన్స్ అన్నట్టుగా వారిసు vs తునీవు తో ఈ ఇద్దరూ హీరోలు థియేటర్స్ గట్టిగా తలపడ్డారు. వినోద్ డైరెక్షన్ లో అజిత్ తునీవుతో, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో విజయ్ వారిసుతో ఈ నెల 11 న పొంగల్ స్పెషల్ గా థియేటర్స్ లో తలపడ్డారు. అయితే అజిత్ తునీవు కి సో సో టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఒకే రకమయిన కాన్సప్ట్స్ తో అజిత్ ప్రేక్షకులని వరసగా నిరాశపరుస్తున్నట్లుగానే ఈ తునీవుతోను మరోసారి ఆడియన్స్ ని డిస్పాయింట్ చేసాడు అన్నారు.

నిజమే అజిత్ సినిమాలో జస్ట్ యాక్షన్ తప్ప ఇంకేమి లేదు. కానీ అజిత్ సినిమాకి వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ జాతరని తునీవు తలపిస్తుంది. నాలుగు రోజులుగా స్టడీగా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. నాలుగు రోజుల్లో అజిత్ తునీవు 100 కోట్ల మార్క్ తో దూసుకుపోతుంది అంటున్నారు. మరోపక్క యావరేజ్ టాక్ తెచ్చుకున్న విజయ్ వారిసు కన్నా అజిత్ తునీవు కే కలెక్షన్స్ బాగా ఉన్నాయంటున్నారు. అయితే ఫైనల్ గా వారిసు vs తూనీవు ల కలెక్షన్స్ విషయంలో ఎవరిది పై చెయ్యి సాధిస్తుందో చూడాలి. 

ప్రస్తుతం అయితే అజిత్ తునీవు టాక్ తో సంబంధం లేకుండా థియేటర్స్ దగ్గర హడావిడి చేస్తుంది. అందుకే నెటిజెన్స్ ఆ టాక్ ఏమిటి? ఆ కలెక్షన్స్ ఏమిటి? అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ సరసన మంజు వారియర్ నటించింది.

What is that talk? What are those collections?:

Ajith Thunivu enter 100 cr club

Tags:   AJITH, THUNIVU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ