విజయ్ దేవరకొండ కొన్నాళ్లుగా మూవీ సెట్స్ లో లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. దివాళి సెలెబ్రేషన్స్ అయినా, దసరా పండుగ అయినా, న్యూ ఇయర్ వేడుకలైనా, క్రిష్టమస్ పండగైనా.. ఇలా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో ఫెస్టివల్ జరుపుకుంటున్నట్లుగా పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. విజయ్ దేవరకొండ షేర్ చేసే పిక్స్ చూస్తే ఆయన డిసాస్టర్ లైగర్ ఎవరికీ గుర్తుకు కూడా రాదు.
మరి ఎప్పటిలాగే ఈ సంక్రాంతి ఫెస్టివల్ ని ఫ్యామిలీతో ఎంత సరదాగా సంప్రదాయంగా జరుపుకున్నాడో విజయ్ దేవరకొండ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేసాడు. తల్లి మకర సంక్రాంతి సందర్భంగా రంగవల్లుల మధ్యన కట్టెల పొయ్యి మీద పొంగలి పెట్టగా.. తండ్రి, తమ్ముడు ఆనంద్ దేవరకొండ లతో విజయ్ దేవరకొండ చక్కటి తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే దుస్తుల్లో రెడీ అయిన పిక్స్ ని షేర్ చేసాడు. విజయ్ సంక్రాంతి సెలెబ్రేషన్స్ పిక్స్ మీ కోసం..
తాజాగా విజయ్ దేవరకొండ సెట్స్ మీదున్న ఖుషి తో పాటుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 అధికారికంగా ప్రకటించాడు. ఆ మూవీలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.