ఈటీవీలో జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని, అభిమాన గణాన్ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఈటీవికి పూర్తిగా దూరమైనట్టే కనబడుతుంది. సినిమాల్లో హీరోగా నటిస్తున్న సుధీర్ కొత్తదనం, అలాగే ఫైనాన్సియల్ ప్రోబ్లెంస్ తో జబర్దస్త్ నుండి ఢీ డాన్స్ నుండి బయటికి వచ్చేసాడు. ఓ ఆరు నెలలు మల్లెమాల యాజమాన్యాన్ని సమయం అడిగి బయటికి వచ్చాను, కొత్తగా స్టార్ మా లో యాంకరింగ్ చేశాను, సినిమా షూటింగ్స్ పూర్తయ్యాయి. సో మళ్ళీ మల్లెమాలకి, ఈటీవికి వెళ్ళిపోతాను, వాళ్ళని అడిగాను ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పమని అన్నాడు.
ఆ వెంటనే సుడిగాలి సుధీర్ గాలోడు ప్రమోషన్స్ కోసం జబర్దస్త్ కి వెళ్ళాడు. ఆ తర్వాత ఈటివి 25 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. దానితో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి రీ ఎంట్రీ కన్ ఫర్మ్ అనుకున్నారు. ఆతర్వాత ఈటీవీ స్పెషల్ ప్రోగ్రాంలో కనిపిస్తాడని అనుకున్నారు. జబర్దస్త్ ఎలా ఉన్నా ఇప్పుడు సుధీర్ ని ఈటివి స్పెషల్ ప్రోగ్రామ్స్ నుండి తప్పించినట్లుగా అనిపిస్తుంది. డిసెంబర్ 31 ప్రొగ్రాంలోను, సంక్రాంతి స్పెషల్ ప్రొగ్రాంలోను సుడిగాలి సుధీర్ కనిపించలేదు.
సుధీర్-రష్మిక ప్లేస్ లో వేరే యాంకర్స్ కనిపించగా ఆ ఈవెంట్ లో జబర్దస్త్ కమెడియన్స్ తో పాటుగా సీరియల్ ఆర్టిస్ట్ లు సందడి చేసారు. కానీ పండగ మూడు రోజుల్లో ఎక్కడా సుధీర్ చప్పుడు లేని కారణంగా సుధీర్ ని ఈటివి నుండి సైడ్ చేస్తున్నారనిపించేలా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.