నందమూరి బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో అభిమానులకి కిక్ ఇస్తూ చేసిన వీరసింహారెడ్డి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యింది. మాస్ ఆడియన్స్ ని ఊపేసిన వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ బాగా పేలాయి. రాయలసీమ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమాలోని కొన్ని డైలాగ్స్ వైసీపీ నాయకులని టార్గెట్ చేసేవిలా ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉన్నా బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రమోషన్స్ లో చేసిన కొన్ని మాటలు ఇప్పుడు ఆయనకి తిప్పలు తెచ్చిపెట్టాయి. వీరసింహారెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ దేవ బ్రాహణులకి గురువు దేవర మహర్షి అని, వారి నాయకుడు రావణాసురుడు అంటూ చరిత్ర వక్రించి మాట్లాడడంపై దేవా బ్రాహ్మణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ చరిత్ర వక్రీకరించేలా మాట్లాడిన మాటలు తమ మనోభావాలు దెబ్బతీసేవిలా ఉన్నాయని.. వెంటనే బాలకృష్ణ క్షమాపణ చెప్పాలంటూ దేవాంగుల కమిటీ వారు డిమాండ్ చెయ్యడంతో నందమూరి బాలకృష్ణ వారికి క్షమాపణ చెబుతూ ఓ లేఖని విడుదల చేసారు. దేవా బ్రాహ్మణ సోదరసోదరీమణులకు మీ సోదరుడు బాలకృష్ణ మనవి.. దేవబ్రాహ్మణుల గురు రావణాసురుడు అని నాకు అందిన సమాచారం తప్పు అని నాకు తెలియజేసిన దేవ బ్రాహణుల పెద్దలకు కృతజ్ఞతలు. నేను మాట్లాడిన మాటలు వలన దేవబ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతిని, వారు బాధపడినట్లుగా తెలిసింది. నాకు వారిని బాధపెట్టాలని లేదు. ఉండదని కూడా తెలుగు ప్రజలకి తెలుసు.
దురదృష్టవు శాత్తు ఆ సమయంలో అనుకోకుండా వచ్చిన మాట మాత్రమే. కావాలని అన్నది కాదు, దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని కావాలని మనసు నొప్పించేట్లుగా ఎందుకు మాట్లాడతాను. నా వాళ్ళని నేను బాధపెట్టుకుంటానా.. అర్ధం చేసుకుని పొరబాటుని మన్నిస్తారని కోరుకుంటున్నట్లుగా బాలకృష్ణ ఆ లేఖలో వివరించారు.