Advertisementt

సౌండ్ లేని శృతి హాసన్

Sun 15th Jan 2023 11:34 AM
shruti haasan  సౌండ్ లేని శృతి హాసన్
Shruti Haasan without sound సౌండ్ లేని శృతి హాసన్
Advertisement
Ads by CJ

ఏ హీరోయిన్ సాధించలేని రేర్ ఫీట్ ఈ ఏడాది శృతి హాసన్ సాధించింది. ఒకేసారి ఆమె నటించిన రెండు సినిమాలు అది కూడా సంక్రాంతి ఫెస్టివల్ కి విడుదల కావడం నిజంగా శృతి హాసన్ లక్ అనే చెప్పాలి. మెగాస్టార్-బాలకృష్ణ లతో ఒకేసారి జోడి కట్టిన శృతి హాసన్ రేర్ ఫీట్ సాధించింది. బాలకృష్ణ వీర సింహారెడ్డి ప్రమోషన్స్ లో కనబడిన శృతి హాసన్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య ప్రమోషన్స్ కి రాలేదు. అనారోగ్య కారణాల వలన వాల్తేర్ వీరయ్య ప్రమోషన్స్ కి దూరమైన శృతి హాసన్ కి ఆ సినిమాల విడుదలకు ముందు ఉన్న క్రేజ్ విడుదలయ్యాక లేకపోవడం గమనార్హం. 

బాలకృష్ణ సరసన వీర సింహారెడ్డిలో కేవలం పాటలు కోసమే ఆమెని తీసుకున్నారనిపిస్తుంది. కేరెక్టర్ కి స్కోప్ లేకపోవడంతో సాంగ్స్ లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన శృతి హాసన్ ని ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు.

ఇక మెగాస్టార్ వాల్తేర్ వీరయ్యలో కూడా శృతి హాసన్ పేరు పెద్దగా వినిపించలేదు. గ్లామర్ ట్రీట్ అందించినా, సాంగ్స్ లో మెగాస్టార్ పక్కన మధురమైన స్టెప్స్ వేసినా, ఓ యాక్షన్ సీన్ చేసినా శృతి హాసన్ పర్లేదులే అనిపించుకుంది కానీ ఆహా ఓహో అనిపించుకోలేదు. కేరెక్టర్ కి ఈ సినిమాలో ఎంతో కొంత స్కోప్ ఉండడంతో హైలెట్ అయ్యింది. అయితే ప్రమోషన్స్ స్కిప్ చెయ్యడంతో శృతి హాసన్ పేరు పెద్దగా వినిపించకుండా పోయింది. లేదంటే శృతి హాసన్ ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో గనక హడావిడి చేసి ఉంటే ఈ సంక్రాంతికి శృతి పేరు బాగా మోగిపోయేది.

Shruti Haasan without sound:

Shruti Haasan skips Waltair Veerayya promotions

Tags:   SHRUTI HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ